
రాష్ట్ర రాజధానిగా అమరావతికి మహార్దశ పట్టిందనే చెప్పాలి. కూటమి రాకతో వైసీపీ ఐదేళ్ల అరణ్యవాసం నుంచి విముక్తి పొందిన అమరావతి దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా తిరిగి పట్టాభిషేకం చేసుకుంది. ఇక అటు నుంచి అమరావతి అభివృద్ధి పనుల వేగం పెరుగుతూ వస్తుంది.
క్వాంటం వ్యాలీ వంటి అద్భుత టెక్నాలజీ నిర్మాణాలు అమరావతికి తరలి వచ్చాయి. ఇక బిట్స్ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు అమరావతిలో కొలువుతీరుతున్నాయి. ఇక తాజాగా రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి అంటూ కేంద్రం పార్లమెంట్ సాక్షిగా అమరావతి కి చట్ట బద్ధత కల్పించింది.
ఇలా అడుగడునా అమరావతికి మంచి రోజులు కనిపిస్తూ వస్తున్నాయి. ఇక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దక్షిణాది కేంద్రంగా నిర్మించే 2 హై స్పీడ్ రైల్ కారిడార్లుకు ఏపీ రాజధాని అమరావతి కేంద్ర భిందువు కానుంది. ఇందులో మొదటి కారిడార్ అమరావతి నుంచి గుంటూరు, చీరాల, నెల్లూరు, నాయుడు పేట, శ్రీ సిటీ మీదుగా హైద్రాబాద్ – చెన్నై కి కలపనుంది.
ఇక రెండవ కారిడార్ నాయుడు పేట, తిరుపతి, చిత్తూరు, బంగారుపేట, బెంగళూర్, మండ్య మీదుగా మైసూర్ వరకు నడుస్తుంది. అయితే ఈ రెండు ప్రతిపాదనలలో మొదటగా హైద్రాబాద్ – చెన్నై కారిడార్ కు మాత్రమే అమరావతిని కేంద్రంగా చేర్చినప్పటికీ ముఖ్యమంత్రి బాబు ప్రోత్సాహం తో రెండవ కారిడార్ లో కూడా అమరావతిని భాగం చేసింది.
అయితే ఈ మార్గాలన్నీ కూడా ఇప్పుడు అమరావతి అభివృద్ధికి అత్యతంత కీలకంగా మారనున్నాయి. వీటి నిర్మాణాలతో రాజధానిగా అమరావతి ముఖ చిత్రం మారనుంది. హై స్పీడ్ రైళ్ల వల్ల అమరావతి నుంచి హైద్రాబాద్, బెంగళూర్, చెన్నై, మైసూర్ వంటి మహానగరాలకు కనెక్టివిటీ వస్తుంది. దీనితో పారిశ్రామిక వేత్తలకు వేగవంతమైన రవాణా కనెక్టివిటీ లభిస్తుంది.
ఒక ప్రాంత అభివృద్ధికి అత్యంత కీలకం గా ఉండే రవాణా కనెక్టివిటీ మెరుగ్గా ఉంటే అది పెట్టుబడిదారులను వేగంగా ఆకర్షించగలుగుతుంది. తద్వారా అమరావతి వేగంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందగలుగుతుంది. పరిశ్రమలు రాష్ట్రానికి తరలి రావడానికి, పెట్టుబడిదారులు అమరావతి వైపు ఆకర్షించబడడానికి ఈ హై స్పీడ్ రైల్ కనెక్టవిటీ దోహద పడుతుంది.
ఒక కొత్త నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందాలి అన్నా, ఇతర నగరాలతో పోటీ పడి ముందుకెళ్లాలని అన్నా అందుకు ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితులతో పాటు అక్కడ ఉన్న మౌలిక వసతులు కూడా పరిగణలోకి వస్తాయి. అటువంటి సందర్భంలో అమరావతికి ఈ రవాణా కనెక్టివిటీ అత్యంత అవసరం.
అలాగే దీనితో అమరావతి కేవలం ఒక పరిపాలన కేంద్రంగానే కాకుండా ఆర్థిక ఇంజన్ గా మార్చడంలో కూడా ఈ హై స్పీడ్ రైల్ కారిడార్లు ముఖ్య భూమిక పోషిస్తాయి. అయితే రాష్ట్రానికి ముఖ్యంగా అమరావతి హై స్పీడ్ రైల్ కారిడార్ లు రావడం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతర శ్రమ, కృషి తో పాటుగా,
కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న తత్ససంబంధాలు, ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ పార్టీ ఆవశ్యకత కూడా అమరావతి అభివృద్ధికి ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ఇందులో భాగంగానే అమరావతి విస్తరణ అంటూ అమరావతి ఇంటర్ నేషనల్ ఎయిర్ ఫోర్ట్ నిర్మాణానికి సైతం రైతుల నుండి ప్రభుత్వం మరో 5 వేల ఎకరాల భూసమీకరణ చేపట్టింది.
బాబు పిలుపుకి అమరావతి రైతులు సుముఖత వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి తమ భూములను అప్పగించేందుకు సిద్ధమయ్యారు. ఇలా మొత్తానికి అమరావతి అభివృద్ధి పనులకు ఒక్కో అడ్డంకి తొలగుతూ ఒక్కో అడుగు ముందుకు పడుతుంది.
Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…
After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…