
గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లుంది వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని తీరు. వారం రోజుల క్రితం రాజ్యసభలో అమరావతి బిల్లుపై చర్చ జరుగుతున్నప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి అమరావతికి మద్దతుగా మాట్లాడుతూ, వైసీపీ నేతలను ఉద్దేశ్యించి చేసిన కామెంట్స్‌పై ఆయన భగ్గుమన్నారు.
కాకపోతే దొంగలు పడిన ఆరు నెలలకన్నట్లు కాస్త ఆలస్యంగా స్పందించారు. ఆ ఆవేశంలో ఆమెకు ధీటుగా జవాబు చెప్పబోయి మళ్ళీ అమరావతి గురించి నోరు జారారు పేర్ని నాని.
“పసుపు రక్తం నిలువెల్లా ప్రవహిస్తున్న రేణుకా చౌదరి గారు వైసీపీ కుక్కలు ఎంత మొరిగినా అమరావతిని ఆపలేరన్నారు. అవును వైసీపీ కుక్కలు అమరావతిని ఆపాల్సిన అవసరం లేదు. నెల రోజుల తర్వాత నాలుగు వర్షం చినుకులు పడితే అమరావతి ఎలాగూ నీళ్ళలో మునిగిపోతుంది,” అని అన్నారు.
అమరావతిని వ్యతిరేకించడం లేదంటూనే నాలుగు చినులు పడితే అమరావతి నీట మునిగిపోతుందని పేర్ని నాని చెపుతుండటం గమనిస్తే దానిని జగన్ బ్యాచ్ ఎంతగా ద్వేషిస్తున్నారో అర్ధమవుతుంది.
ఒక రాజకీయ పార్టీ మరో పార్టీని, ఆ పార్టీ అధినేత, నాయకులు తమ ప్రత్యర్ధి పార్టీ అధినేతని, నాయకులని ద్వేషించడం చూస్తాము. కానీ ఐదేళ్ళు రాష్ట్రాన్ని పాలించిన ఓ పార్టీ అధినేత, నాయకులు రాష్ట్ర రాజధానిని ఇంతగా ద్వేషించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
అమరావతి గురించి పేర్ని నాని అన్న ఈ మాటలు తమ అధినేత జగన్ మనసులో మాటలే. అమరావతిని వ్యతిరేకించడం లేదంటూనే ఈవిధంగా మాట్లాడుతూ దాని పట్ల తమ వైఖరి ఏమాత్రం మారలేదని పదేపదే నిరూపించుకుంటూనే ఉన్నారు.
కనుక అమరావతిని ద్వేషిస్తున్న వైసీపీ నేతలందరూ ఒకరి నెత్తిపై మరొకరు భస్మాసుర హస్తం పెట్టుకుంటున్నారనిపిస్తుంది. అమరావతికి వ్యతిరేకంగా వారు మాట్లాడుతున్న ప్రతీ మాట వైసీపీకి సమాధికి రాళ్ళుగా మారుతాయని గ్రహించడం లేదు.
కానీ అమరావతి పట్ల వారి ఈ ధోరణే కూటమి పార్టీలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ప్రజలకు కూడా శ్రీరామ రక్ష. వారి ఈ పిచ్చి ప్రేలాపనలను వింటున్న ప్రజలు వైసీపీకిచ్చిన 11లో నుంచి 10 సీట్లు వెనక్కు తీసేసుకున్నా ఆశ్చర్యం లేదు. కనుక జగన్ చెప్పినట్లు మూడేళ్ళు కళ్ళు మూసుకుంటే చాలు!
Venkatesh-Trivikram’s Aadarsha Kutumbam AK 47 was expected to arrive on October 9 after missing its…
Sanjay Dutt faced severe criticism after a recent appearance on Shekhar Suman’s show. His comments…