Telugu

నంది అవార్డులు కావాలి.. కానీ అమరావతి పట్టదు!

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంట్ ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలోని ప్రజలతో పాటు దేశవిదేశాలలో ఉన్న ఆంధ్రా ప్రజలు కూడా రాజధాని విషయంలో అనిశ్చితి తొలగిపోయినందుకు చాలా సంతోషిస్తున్నారు.

యూపీ, బిహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాలకు చెందిన పలు పార్టీలు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు, సిఎం చంద్రబాబు నాయుడుకి అభినందనలు తెలుపుతున్నాయి.

ADVERTISEMENT

కానీ తెలుగు సినీ పరిశ్రమ నుంచి దర్శకుడు బోయపాటి శ్రీను తప్ప మరెవరూ అభినందించినవారు లేరు. కనీసం స్పందించలేదు!

తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులు ఇస్తుంటే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నంది అవార్డులు ఇవ్వాలి కదా? అని ఆర్‌.నారాయణ మూర్తి నిలదీస్తారు.

స్వరాష్ట్రాన్ని ‘పొరుగు రాష్ట్రం’ అంటూ ‘అవార్డుల విషయంలో వెనకబడిపోయిందంటూ’ చిరంజీవి వంటివారు ఆక్షేపిస్తుంటారు. మాకు నంది అవార్డులు ఇస్తే మీకే గౌరవమని సుద్దులు చెప్తుంటారు.

కానీ ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి అన్ని అవరోధాలు తొలగిపోయినందుకు ఒక్క అభినందన తెలియజేయడానికి ఎవరికీ నోరు పెగలదు? కనీసం టీడీపితో సిఎం చంద్రబాబు నాయుడుతో సన్నిహిత సంబంధాలున్న నిర్మాత అశ్వినీ దత్, దర్శకులు రాఘవేంద్రరావు వంటివారు కూడా స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు రాష్ట్రంతో తమకు సంబంధం లేదన్నట్లు హీరోయిన్లు ఎలా వ్యవహరిస్తుంటారో అచ్చం అలాగే మన తెలుగు సినీ ప్రముఖులు తీరు కూడా ఉంది.

అసలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, ప్రభుత్వంతో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు ఎందుకు దూరంగా ఉంటున్నారు? జగన్‌ భయంతోనా? హైదరాబాద్‌లోనే తమ ఆస్తిపాస్తులు ఉన్నందున చంద్రబాబు నాయుడుతో సఖ్యతగా ఉంటే కేసీఆర్‌, కేటీఆర్‌కి ఆగ్రహం కలుగుతుందనే భయంతోనా? లేదా అవసరమైనప్పుడు బొకేలు పట్టుకొని వెళితే చాలు పనైయిపోతుందనే చులకనభావంతోనా?

ఏది ఏమినప్పటికీ మన సినీ ప్రముఖులను ఇంటికి రప్పించుకొని చేతులు జోడించి ప్రాదేయపడేలా చేసిన జగన్మోహన్ రెడ్డి వారికి సరైనోడు.

ఆంధ్రప్రదేశ్‌ పట్ల ఏమాత్రం అభిమానం లేని ఇలాంటి వాళ్లకు నంది అవార్డులు ఇవ్వడం దండగ. ఈసారి టికెట్ ఛార్జీలు పెంచమని వచ్చినప్పుడు వాత పెడితే తప్ప అర్థం కాదు.

ఆంధ్రా గ్రామీణ, పట్టణ, నగర నేపధ్యంతో చక్కటి తెలుగు పేర్లతో తీసే చిన్న సినిమాలకి మాత్రమే నంది అవార్డులు ఇస్తే సరిపోతుంది కదా? ఆవిధంగానైన మన ఆంధ్రా సంస్కృతీ సాంప్రదాయాలు, భాష, యాస, మాండలికాలు, గ్రామీణ, పట్టణ సంస్కృతిని ప్రతిభింబించే చక్కటి తెలుగు సినిమాలను ప్రోత్సహించినట్లవుతుంది కదా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Tollywood Directors’ Ego: Great Frames, Terrible Writing

In Tollywood, many directors want complete control over their films but fail to give screenwriting…

28 minutes ago

భీమిలి పరీక్ష అనూషకు కాదు.. బొత్సకే?

భీమిలి వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా చేసిన చిన్న శ్రీను పార్టీకి, పదవులకు రాజీనామా చేసి వెళ్ళిపోవడం, బొత్స సత్యనారాయణకు పెద్ద షాక్.…

29 minutes ago