
భీమిలి వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా చేసిన చిన్న శ్రీను పార్టీకి, పదవులకు రాజీనామా చేసి వెళ్ళిపోవడం, బొత్స సత్యనారాయణకు పెద్ద షాక్. రాజకీయాలలో ఇలాంటి షాకులు తట్టుకొని నిలబడిన వ్యక్తి అయన. కనుక దీనిని ఆయన తన కుటుంబానికి లభించిన మరో గొప్ప అవకాశంగా భావించి తన కుమార్తె అనూషని ఆ స్థానంలో నియమింపజేసుకున్నారు.
బొత్స సత్యనారాయణ తన కుమార్తె అనూషను స్థానిక వైసీపీ శ్రేణులకు పరిచయం చేసేందుకు నేడు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. దీని కోసం అయన బాగానే డబ్బు ఖర్చు చేశారు.
అటు విజయనగరం జిల్లా నుంచి ఇటు విశాఖ జిల్లా వరకు దారిపొడవునా వందల ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు చేయించారు. “ఓ కొత్త ఆలోచన.. ఓ కొత్త అడుగు.. ప్రగతి పదం వైపు..” అంటూ కుమార్తెని హైలైట్ చేస్తూ ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టించారు.
సమావేశంలో మాట్లాడుతూ, “ఎన్టీఆర్ టీడీపి పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు సార్లు మాత్రమే భీమిలిలో వైసీపీ గెలిచింది. భీమిలి వంటి పెద్ద నియోజకవర్గంలో పార్టీ అభ్యర్ధిని నిలబెట్టాల వద్దా? అని అనేక తర్జన భర్జనలు పడిన తర్వాత చిన్న శ్రీను ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తే అయన సొంత కారణాలతో వెళ్ళిపోయారు.
కనుక మన అధినేత జగన్ ఇప్పుడు నా కుమార్తె అనూషని అతని స్థానంలో నియమించారు. ఇంత పెద్ద నియోజకవర్గాన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టమే. కానీ రాజకీయాలలో సవాళ్లు స్వీకరించగలిగేవారే రాణిస్తారు. ఇక నుంచి మనమూ గట్టిగా ప్రయత్నిద్దాం. మీరందరూ అనూషకు అండగా నిలబడి, ఆమె నేత్రుత్వంలో భీమిలి నియోజకవర్గంలో మన పార్టీని బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
అయితే చిన్న శ్రీనుతో పాటే స్థానిక వైసీపీ క్యాడర్ కూడా బయటకు వెళ్ళిపోయినప్పుడు, భీమిలిలో ఆయన తన కుమార్తెను నిలబెట్టడం, ఆమెకు రాజకీయ పాఠాలు నేర్పించడం ఓ పెద్ద పని.
అక్కడ వైసీపీ క్యాడర్ ఏమైనా మిగిలి ఉండి ఉంటే వారందరి మద్దతు కూడగట్టడం, రెండుసార్లు భీమిలి ఎమ్మెల్యేగా గెలిచిన గంటా శ్రీనివాసరావుని ఎదుర్కోవడం మరో పెద్ద పరీక్ష.
అయితే ఆమె ఇప్పుడే రాజకీయ ఆరంగ్రేటం చేశారు కనుక ఈ పరీక్షలు ఆమెకు కాదు. ఆమె కోసం ఈ సీటు సంపాదించిపెట్టిన బొత్స సత్యనారాయణదే అని చెప్పవచ్చు.
కనుక ఇకపై అయన అటు విజయనగరం జిల్లాలోని తన సొంత నియోజకవర్గం చీపురుపల్లిని , ఇటు విశాఖ జిల్లాలోని బలమైన రాజకీయ ప్రత్యర్ధి గంటా శ్రీనివాస రావుకు బలమైన అడ్డా భీమిలి నియోజకవర్గం.. రెంటినీ ఆయనే చూసుకోవాల్సి ఉంటుంది. కనుక వచ్చే సార్వత్రిక ఎన్నికలలో భీమిలిలో అనూష గెలిచినా ఓడినా ఆ క్రెడిట్, డెబిట్ బొత్స సత్యనారాయణ పద్దులోనే జమా అవుతాయి.
In Tollywood, many directors want complete control over their films but fail to give screenwriting…
Sree Vishnu will next be seen in the period entertainer Comrade Kalyan. Directed by Janakiram…