
కులాలను అడ్డుపెట్టుకుని రాజకీయంగా ఎదగడం, పదవులు పొందడం ఎక్కడైనా పరిపాటే. కానీ ఏ కులం పేరు అడ్డుపెట్టుకుని పదవులు పొందారో చివరికి ఆ కులాన్నే కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం వైసీపీ కాపు నేతలకు అలవాటుగా మారింది. ప్రత్యర్థి పై విమర్శలు చేయడానికి తన కులాన్ని కించపరిచే మేధావులలో పేర్ని నాని, అంబటి రాంబాబు ముందు వరుసలో ఉంటారు. పేరుకి కాపులే కానీ మేము జగన్ దగ్గర పెద్ద పాలేరులం., మేమంతా కాపు నా కొడుకులం..,కాపు సన్నాసులం అంటూ కులాన్ని కించపరుస్తూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు పాపం కుల పెద్దగా చెప్పుకునే ముద్రగడకు బహుశా వినిపించలేదేమో.!
విషయానికి వస్తే..శాసనసభ సమావేశాలలో భాగంగా నేడు బాలకృష్ణ, అంబటి మధ్య వాగ్వాదం చెలరేగింది. సభలో బాలకృష్ణ మీసాలు తిప్పుతున్నారని అలాంటి రెచ్చ గొట్టే పనులు సినిమాలలో చేయాలి కానీ ఇక్కడ కాదు అంటూ అంబటి బాలకృష్ణ పై ఫైర్ అయ్యారు. అందుకు బాలకృష్ణ కూడా అదే విధంగా బదులిచ్చారు. నేను సభలోకి రాగానే తొడలు కొట్టిన వైసీపీ నేతలకు ప్రతిగా ఇచ్చిన సమాధానమే ఇది అంటూ అంబటికి కౌంటర్ వేశారు.
అయితే ఒక విషయాన్ని కులానికి ఆపాదించకుండా ముగించే ఉద్దేశం లేని సదరు మంత్రి గారు “నా బ్లడ్ వేరు, నా బ్రీడ్ వేరు.,మీసం తిప్పితే ఊరుకోవడానికి ఇక్కడ ఉంది కాపు బిడ్డ! నాది తెలుగు గడ్డ!” అంటూ అర్ధం పర్ధం లేని ప్రాసలతో ఒక ట్వీట్ వేశారు. అంబటి అలా ట్వీట్ వేసారో లేదో ఇలా రిప్లై ఇచ్చేసారు సోషల్ మీడియా ప్రత్యర్థులు. “కాపులు తెలివి తక్కువ వాళ్ళు, అవేశపరులు, మాంసం ఎక్కువ తింటారు, తాగుబోతులు”…. అంటూ అప్పట్లో అంబటి చేసిన వ్యాఖ్యలు వైరల్ చేస్తున్నారు.
ఇప్పుడు నడుస్తుంది సోషల్ మీడియా జమానా…! గుర్తు ఉంచుకోవాలి కదా మంత్రి గారు! “గంటకో అరగంటకో మర్చిపోవడానికి ఇక్కడ ఉంది అంబటి కాదు సోషల్ మీడియా”…అంటూ అంబటికి తనదైన స్టైల్ లోనే రీట్వీట్స్ చేస్తున్నారు. గూగుల్ లో ఇట్ఠాకొడితే అట్టా వచ్చేస్తది ఇది మరిచిపోతే ఎలా? అంటూ సెటైర్లతో సమాధానమిస్తున్నారు. గడిచిన కొద్దీ కాలంగా అంబటికి సినిమాల మీదకు మనసు మళ్ళినట్లయింది. రోడ్ల మీద డాన్స్ లు, సినిమా కల్లెక్షన్స్ మీద ఆసక్తి, పంచులు – ప్రాసలు మాములుగా లేదుగా?
The original uncut version of Obsession is scheduled to premiere on JioHotstar on October 30.…
BOTTOM LINE History Without Heart RATING 2/5 Story, Screenplay, Director: Rahul Sankrityan Cast: Vijay Deverakonda,…