
అంబటి రాంబాబు అరెస్టుతో పార్టీకి రాజకీయ మైలేజ్ కోసం రాష్ట్రంలో కుల రాజకీయాలను ప్రయోగించిన వైసీపీ, అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి – ఉపముఖ్యమంత్రి సామాజికవర్గాల మధ్య రాజకీయ విద్వేషాలు సృష్టించాలని భావించింది.
అందుకోసం కాపు నుంచి రెడ్డి గా మారిన మాజీ కాపు సామజిక వర్గ నాయకుడిని రంగంలోకి దింపింది. అలాగే వైసీపీ లో ఉన్న ఆ సామజికవర్గ నేతలందరినీ అంబటి ఇంటి ముందు క్యూ లో నిలుచోబెటింది. ఇక వైస్ కుటుంబ వీరవిధేయుడు, వైసీపీ కి ఆత్మబంధువు ని మీడియా ముందుకు తెచ్చింది.
ఇక రాంబాబు కుటుంబ సభ్యులను రాజకీయంలోకి తెచ్చింది. అంబటి కుమార్తె సైతం ఒక వ్యక్తి ఇంటి పై దాడిని సామాజికవర్గం మీద జరిగిన దాడి గా చిత్రీకరించే ప్రయత్నం చేసారు. అలాగే వైసీపీ అధినేత వైస్ జగన్ నుంచి గుడివాడ అమర్నాధ్ వంటి మాజీ మంత్రి వరకు అంబటిని కాపు పులి అంటూ కీర్తిస్తూ కాపాడు సామాజికవర్గం ప్రజలను రెచ్చకొట్టేందుకు సిద్దపడ్డారు.
ఇలా ఈ ఒక్క అరెస్టుతో వైసీపీ తెరవెనుక, తెరముందు ఇంత రాజకీయం నడిపింది కేవలం జనసేన – టీడీపీ మధ్య రాజకీయ విద్వేషాలు సృష్టించాలని, తద్వారా బాబు – పవన్ ల మధ్య దూరం పెంచాలని, కానీ పవన్ బాబు ల మధ్య ఉన్న స్నేహబంధం ముందు వైసీపీ వేసిన ఆ ప్రణాళికలన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరు మాదిరి వృధా అయిపోయాయి.
బాబు కాపు కుల ద్రోహి, టీడీపీ కాపు సామజికవర్గ నేతలను టార్గెట్ చేస్తుంది, బాబు – లోకేష్ పథకం ప్రకారమే అంబటి ఇంటి మీద దాడిని ప్రోత్సహించారు, ఇది కాపు సామాజికవర్గం మీద జరిగిన దాడి, నాడు రంగా హత్య, నేడు అంబటి అరెస్టు అంటూ రాష్ట్రంలో మరోసారి కుల చిచ్చులు పెట్టడానికి వైసీపీ పెద్ద నిప్పే రాజేసింది.
అయితే ఆ నిప్పు వైసీపీకి రాజకీయంగా ఎటువంటి ప్రయోజనాన్ని కలిగించలేకపోయింది. అంబటి రాంబాబు అరెస్టు మొదలు ఆయన బైలు వరకు వైసీపీ ఈ తరహా రాజకీయాన్నే నమ్ముకుని ముందుకు సాగింది.
ఇక ఈ మొత్తం ఎపిసోడ్ లో నేడు అంబటి రాంబాబు కి వచ్చిన బైలు అనేది వైసీపీ కుల రాజకీయ చిత్రానికి ఇంటర్వెల్ ఆ.? లేదా పార్ట్ – 2 తగ్గేదెలా అంటూ రానున్న రోజులలో సీక్వెల్ మొదలుపెడుతుందా.?
NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…
Team India started the T20I series against West Indies with a complete performance in Lucknow.…