
రాష్ట్ర ముఖ్యమంత్రి బాబు ని బూతులు తిట్టిన కేసు, పీపీపీ విధానం పై నిరశన కార్యక్రమాల నెపంతో పోలీసులు మీద దురుసుగా ప్రవర్తించిన కేసు ఇలా పలురకాల కేసులలో అరెస్టయిన వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు దోషా.? బాధితుడా.?
అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, నడి రోడ్డు మీద సీఎం పై బూతులతో రెచ్చిపోయిన అంబటి ని బాధితుడిగా, ఆయన నోటి దూలకు బలైన సీఎం బాబు ని దోషిగా చిత్రీకరిస్తున్నారు వైసీపీ నాయకులు మరియు జగన్ మద్దతుదారులు.
ఇది కాపు కులం మీద దాడి అంటూ, కాపు నాయకుల అణిచివేత అంటూ జగన్ పరామర్శల యాత్ర చేసారు, వైసీపీ కాపు నాయకులతో అంబటి కుటుంబం కోసం ఓదార్పు యాత్ర చేయించారు. ఇలా ఒక ముఖ్యమంత్రిని లకారాలతో బూతులు తిట్టిన అంబటిని జగన్ కాపు సింహం చేసారు. బాధితుడిగా మార్చారు.
అలాగే బాబు సతీమణి భువనేశ్వరి పై అవమానకర రీతిలో దూషణలు చేసిన వల్లభనేని వంశీని అందగాడిని చేసారు, ఇప్పుడు అజ్ఞాతంలో ఉంచారు. ఇలా వైసీపీ లో ఉండే అందగాళ్ళను, సింహాలను దగ్గరుండి ప్రోత్సహిస్తున్న జగన్ వైసీపీ లో ఇంకెంతమందిని వీరి కోవలోకి తెస్తారో.? మరెంతమంది బాధితులను దోషులుగా చిత్రీకరిస్తారో..!
అయితే ఆ ప్రోత్సాహకాల ఫలితం కేసుల రూపంలో వెంటాడుతాయి, అరెస్టుల రూపంలో అనుసరిస్తాయి, బైళ్ల రూపంలో బయటకు తెస్తాయి. ఇప్పుడు ఈ ప్రోత్సాహకాల ఫలితాలలో చివరి దశలోకి చేరుకున్నారు అంబటి. ఇప్పటికే ఈ బూతు రాజకీయాలకు, దురుసు ప్రవర్తనకు కేసులు మీదేసుకుని, అరెస్టయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి ఇపుడు బెయిలు పొంది బయటకు రాబోతున్నారు.
బాబు పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను మొన్న కోర్ట్ నుంచి బైలు పొందిన అంబటి, పీపీపీ పై నిరశన అంటూ పోలీసుల పై ప్రవర్తించిన తీరుకి మరోకేసులో రిమాండ్ ఖైదీగా వెళ్లారు. అయితే ఇప్పుడు ఆ కేసు పై కూడా అంబటి కి న్యాయస్థానం బైలు మంజూరు చేయడంతో రేపు ఈ కాపు సింహంగా చిత్రీకరించబడ్ద అంబటి దోషిగా తప్పు ఒప్పుకుంటారా.? లేదా బాధితుడిగా తప్పుపడతారా.?
NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…
Team India started the T20I series against West Indies with a complete performance in Lucknow.…