
వైసీపీ మంత్రులు ఈ మధ్యకాలంలో పాల్గొంటున్న వేడుకుల వార్తలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రేండింగ్ లోనూ, మీడియాలో చర్చనీయాంశాలుగా మారిపోతున్నాయి. మొన్నీమధ్య వంగవీటి వారి కార్యక్రమానికి వచ్చిన కొడాలి నాని, వల్లభనేని వంశీ రెండురోజుల పాటు ట్రోలింగ్ లోనూ,వార్తలలో నిలిచారు.ఇప్పుడు అంబటి వంతు వచ్చినట్టుంది.
తాజాగా ఖమ్మంలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరవ్వడానికి బయలుదేరిన అంబటి గారు దారంతా అవరోధాలనే ఎదుర్కోవాల్సి వచ్చింది.ముందుగా సత్తుపల్లె సిబారులో గోధుమ బస్తాలతో వెళుతున్న లారీ తాడు తెగిపోవడంతో లారీలో ఉన్న బస్తాలు అంబటి కారుమీద పడి అంబటి కారు స్వల్పంగా దెబ్బతినింది. అయితే అంబటి మరో కారులో కార్యక్రమానికి బయలుదేరారు.
ఖమ్మం చేరుకున్నఏపీ మంత్రి గారికి తెలంగాణ తెలుగు తమ్ముళ్ల రూపంలో మరో అడ్డంకి ఎదురయ్యింది. బాబు అరెస్టుతో ఆవేశంలో ఉన్న టీడీపీ అభిమానులు గ్రాండ్ గాయత్రీ హోటల్ సమీపంలో అంబటి కారుని అడ్డుకుని అంబటి గో బ్యాక్, డౌన్ డౌన్ వైసీపీ, బాయ్ బాయ్ జగన్, జై చంద్రబాబు, జై టీడీపీ అంటూ నినాదాలతో నిరసన తెలిపారు. టీడీపీ నేతల నినాదాలతో అప్రమత్తమైన పోలీసులు నిరసన కారులను చెదరగొట్టి అంబటి లైన్ క్లియర్ చేశారు.
ఇప్పుడు అంబటి ఎదుర్కున్న నిరసన వీడియో కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రానున్న కాలంలో వైసీపీ నేతలందరూ ఇదే పరిస్థితిని ఎదుర్కోకతప్పదు అంటూ బాబు అభిమానులు వైసీపీ నేతలను హెచ్చరిస్తున్నారు. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే ప్రజలు జగన్ కు ఇచ్చిన ఒక్క ఛాన్స్ అవకాశం పూర్తయితే ఇక రెండు రాష్ట్రాలలో వైసీపీ నేతలు ఇప్పుడు తమ అధినేత మాదిరి పరదాలు చాటున తిరగాల్సిందే అంటున్నారు తెలుగు తమ్ముళ్లు.
మొత్తానికి వైసీపీ నేతలకు వేడుకలే వివాదాలుగా మారడం కూడా ఎవరి స్క్రిప్ట్ లో భాగమో ఒక్కసారి ఆలోచించుకోవాలి. రానున్న భవిష్యత్ కు సూచికలుగా ఈ పరిణామాలను భావించాలి అంటూ ప్రతిపక్షాలు మాత్రం ఎక్కడా తగ్గకుండా ఈ వీడియోలతో నాయకులను ఎప్పుడు ప్రచారంలో ఉంచుతున్నారు.నెటిజన్లు మాత్రం ప్రచారం మంచిదేలే అంటూ వీడియోలను షేర్ చేస్తున్నారు.
A Reddit post has gone viral for claiming that the cybersecurity firm Fortinet has laid…
An Indian F-1 student finds herself in serious trouble. A misunderstanding at Walmart has left…