
టీడీపీ పార్టీ రంగు ‘పసుపు’..కానీ టీడీపీ నేత లోకేష్ రాసుకున్నది ‘రెడ్’ బుక్. వైసీపీ రంగు ‘బ్లూ’ కానీ వైసీపీ నేత అంబటి రాంబాబు రాస్తున్నది ‘గ్రీన్ బుక్’. టీడీపీ నేతలను విమర్శించాలి అన్నా, ఆయా పార్టీలకు వత్తాసు పలికే మీడియాను టార్గెట్ చేయాలన్నా వైసీపీ నేతలు యెల్లో మీడియా, పచ్చ బ్యాచ్ అంటూ కౌంటర్లు వేస్తారు.
అలాగే టీడీపీ శ్రేణులు వైసీపీ ని టార్గెట్ చెయ్యాలి అన్నా, వారికి సంబంధించిన మీడియా ప్రస్తావన తీసుకువచ్చినా బ్లూ మీడియా, నీలి బ్యాచ్ అంటూ ప్రతిదాడి చేస్తారు. అయితే ఈ రెండు పార్టీల నేతలు రెడ్ బుక్, గ్రీన్ బుక్ పేర్లతో పుస్తకాలను సిద్ధం చేస్తున్నారు.
అంటే రెడ్ బుక్ తో రాష్ట్రంలో అక్రమాలకు ఫుల్ స్టాప్ పెడతాము అంటూ లోకేష్ ప్రకటిస్తే గ్రీన్ బుక్ తో ఆ అక్రమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తామని అంబటి చెప్పాలనుకుంటున్నారా.? లేక లోకేష్ ఎదో రాసాడు, అధికారం పొందాడు కాబట్టి తానూ కూడా పార్టీ క్యాడర్ ను సంతృప్తి పరచడానికి ఏదోకటి రాయాలి అనుకుంటున్నారా.?
లోకేష్ తన యువగళం పాదయాత్రలో భాగంగా ఈ రెడ్ బుక్ ను సృష్టించారు. అప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం చట్టాలను అతిక్రమించి తమ పార్టీ నేతల పై కేసులు పెట్టి జైళ్లకు పంపించిన వైనాన్ని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యకర్తల మీద చేసిన దాడులను ఈ రెడ్ బుక్ లో నోట్ చేస్తున్నాను.
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇటువంటి క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వైసీపీ నేతలను, వారి ఆదేశాలను పాటించి చట్టాలను చేతుల్లోకి తీసుకున్న అధికారులను చట్టపరంగా శిక్షించి న్యాయపరంగా శిక్షలు వేస్తాము అంటూ తమ పార్టీ శ్రేణులకు, సాధారణ ప్రజలకు హామీ ఇచ్చారు.
అయితే అనుకున్నట్టే టీడీపీ కూటమి అధికారంలోకి అయితే వచ్చింది కానీ లోకేష్ చెప్పినట్లు రెడ్ బుక్ న్యాయం జరగడం లేదు అంటూ పార్టీ శ్రేణులు గగ్గోలు పెడుతుంటే, రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ పాలన నడుస్తుంది అంటూ వైసీపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. అయితే ఇందులో ఎవరి వాదనలో వాస్తవం ఉంది అని తెలియాలంటే ఒకటి వైసీపీ నేతల నోర్లు మూతపడాలి, లేక టీడీపీ శ్రేణుల చర్యలు హద్దులు దాటాలి.
అయితే ఇప్పుడు ఏపీలో ఈ రెండు అమలవుతున్నాయా అంటే వైసీపీ నేతల నోళ్లే కాదు కనీసం ఆ పార్టీ అధికార ప్రతినిధి నోరుకూడా కంట్రోల్ లో ఉండడం లేదు.అలాగే గత వైసీపీ ప్రభుత్వం మాదిరి టీడీపీ వారి పై చర్యలు తీసుకుని, అక్రమ కేసులు మోపి జైళ్లకు పాముతుందా అంటే అది జరగడం లేదు. అంటే వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్లు ఏపీలో రెడ్ బుక్ పాలన కొనసాగడం లేదనే భావించాలి.
అయితే తాజాగా వైసీపీ నేత మాజీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు తానూ గ్రీన్ బుక్ రాస్తున్నాను అంటూ ప్రకటించారు. అయితే ఈ గ్రీన్ బుక్ లో పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తల పేర్లు నమోదు చేస్తానని, తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ పేర్లను పార్టీ అధినేత వైస్ జగన్ ముందు ఉంచి సదరు వ్యక్తులకు అవసరమైన పనులు చేయమని అడుగుతా అంటూ పార్టీ కింద స్థాయి కార్యకర్తలు హామీ ఇస్తున్నారు.
అంటే ప్రస్తుతానికి వైసీపీ పార్టీ తరుపున గ్రౌండ్ లెవెల్ లో పని చేయడానికి కూడా ఎవ్వరు ముందుకు రావడం లేదని అంబటి తమ పార్టీ బలం పెంచుకోవడానికి ఇటువంటి ఆఫర్లను ఎరగా వేసి పార్టీ క్యాడర్ ను నిలబెట్టుకుంటున్నారా అంటూ అంబటి గ్రీన్ బుక్ మీద సోషల్ మీడియాలో సైటర్లు పేలుతున్నాయి.
అలాగే మీ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల కోసం కాకుండా పార్టీ క్యాడర్ కోసం పని చేస్తారా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఎవరెన్ని బుక్కులు పెట్టుకున్నా చివరికి ఒక రాజకీయ నాయకుడి భవితవ్యాన్నితేల్చేది మాత్రం ఓటర్ వేసే బ్యాలెట్ బుక్కే అనేది మాజీ మంత్రికి, వైసీపీ నేతలకు ఎప్పటికి అర్ధమవుతుందో.
Vijay Deverakonda and Rashmika Mandanna visited Tirumala ahead of Ranabaali's release and offered prayers for…
The opposition’s march to the Supreme Court over voter-list revision has put the BJP in…