
వైసీపీ సోషల్ మీడియా స్టార్ పొలిటీషియన్ మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాలో ఎంత కనిపిస్తారో అదే విధంగా సోషల్ మీడియాలో కూడా అంతే వినిపిస్తారు కూడా.
అయితే గతంలో తన ప్రత్యర్థి పార్టీ నాయకులను, ఆ పార్టీ విధానాలను హేళన చేయడానికో, కించపరిచేందుకో, వెటకారం చేసేందుకో, లేక విమర్శలు గుప్పించేందుకో తన సోషల్ మీడియాను వినియోగించే అంబటి మొట్టమొదటి సారిగా తన ప్రత్యర్థి పనితీరు పై ప్రశంసలు కురిపించేందుకు వినియోగించారు.
కూటమి రాకతో టీటీడీ విధి విధానాల నుంచి అక్కడ శ్రీవారి భక్తులకు అందుబాటులో ఉండే లడ్డు ప్రసాదం, అన్న ప్రసాదాల వరకు ప్రతి అంశంలోనూ సమూల మార్పులు చోటుచేసుకున్నాయి.
వాటి నాణ్యతలోనూ, వాటి నిర్వహణలోనూ వచ్చిన సానుకూల మార్పులకు సామాన్య భక్తులే కాదు ఏకంగా వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు సైతం సంతృప్తి వ్యక్తం చేసారు.
తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లిన అంబటి అటు పిదప తిరుమలలోని శ్రీ వెంగమాంబ అన్న వితరణ కేంద్రంను సందర్శించి కుటుంబ సమేతంగా శ్రీవారి అన్న ప్రసాదాలను స్వీకరించారు.
ఈ సందర్భంగా ప్రసాదం చాల శుచిగా, రుచిగా ఉందంటూ టీటీడీ పై ప్రశంసంలు కురిపిస్తూ తన సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన వీడియో పోస్ట్ చేసారు.
టీటీడీ దేవస్థానం భక్తులకు నాణ్యమైన భోజనాన్ని శుచిగా అందిస్తుందని, రోజుకి 90 వేలమందికి ఈ విధమైన భోజనం అందించడం చాల ఆశ్చర్యం కలిగిస్తుందంటూ టీటీడీ పని తీరుపై పొగడ్తల వర్షం కురిపంచారు అంబటి. దీనితో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అయితే ఒక పక్క వైసీపీ ముఖ్య నేత, జగన్ కు సన్నిహితుడైన భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల పుణ్య క్షేత్రాన్ని టీటీడీ భ్రష్టు పట్టిస్తోందని, శ్రీవారి భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో టీటీడీ విఫలమయ్యిందని,
తిరుమల టీటీడీ బోర్డు అపచారాలతో అపవిత్రం అయిపోయినదేనంటూ నానా హంగామా చేస్తుంటే, మరో పక్క కరుడుగట్టిన వైసీపీ నాయకుడిగా పేరుపొందిన అంబటి మాత్రం టీటీడీ సంస్కరణలను ప్రశంసించడం అంటే అది అంబటి చేస్తున్న పెద్ద సాహసమనే చెప్పాలి.
మరి జగన్ ను మెప్పించని ఈ సాహసానికి అంబటి ఎందుకు సిద్దపడ్డారో.? దాని పర్యవసానాలను అంచనా వేసుకునే అంబటి ఈ సాహసానికి ముందుకొచ్చారా.? ఈ సాహసానికి వైసీపీ నుండి అంబటికి రిటర్న్ గిఫ్ట్ ఉంటుందా.? ఈ అంబటి ప్రశంసలను సాక్షి ప్రచారం చెయ్యగలదా.? దీనికి వైసీపీ నేతల మద్దతు లభిస్తుందా.? అంటూ ఇలా అనేక ప్రశ్నలు అంబటి సోషల్ మీడియాను వెంటాడుతున్నాయి.
Kayadu Lohar came into Tollywood with plenty of promise, but three films later, her Telugu…
Kona Venkat used satire to explain the censor experience faced by Comrade Kalyan. Speaking at…