
వైసీపీ లో ఉన్న నాయకులకు తనకంటూ ఒక సొంత ఇమేజ్ ఉంటే, ఉండాలనుకుంటే అందుకు వైసీపీ రాజ్యాంగం నుంచి ఆమోదం లభిస్తుందా.? గతంలో వైస్ జగన్ సొంత సోదరి వైస్ షర్మిల సైతం తన పాదయాత్రలతో, ప్రచార ప్రసంగాలతో వైసీపీ లో తనకంటూ ఒక సొంత ఇమేజ్ సృష్టించుకున్నారు.
దాని ఫలితం జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే వైస్ షర్మిల వైసీపీ తో పాటుగా ఆంధ్రప్రదేశ్ ను కూడా వీడాల్సి వచ్చింది. ఇక జగన్ తల్లి విజయలక్ష్మి కి కూడా వైఎస్ సతీమణిగా పార్టీలో ఒక ప్రత్యేక స్థానం, అలాగే ఆమె పట్ల వైసీపీ నేతలలో ఒక ప్రత్యేక గౌరవ మర్యాద ఉండేది.
చివరికి దాని ఫలితం కూడా విజయలక్ష్మి వైసీపీ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే వైసీపీ గౌరవ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక విజయసాయి రెడ్డి, వైసీపీ లో వైస్ జగన్ తరువత స్థానం ఎవరిదీ అని ఏపీలో చిణ్ణపిల్లాడిని అడిగిన టక్కున చెప్పే పేరు సాయిరెడ్డి.
వైసీపీ కి అధికార పీఠం దక్కడానికి, వైస్ జగన్ కి ఒక్క ఛాన్స్ అవకాశం లభించడానికి తెరవెనుక సాయిరెడ్డి సేవలు అనూహ్యంగా పనిచేశాయని, దానిఫలితం జగన్ తో సరిసమానంగా వైసీపీ నాయకులలో సాయి రెడ్డి పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉండేది.
దాని పర్యవసానం జగన్ కోటరీ నుంచి సాయిరెడ్డి కి వీడ్కోలు అనే రిటర్న్ గిఫ్ట్ అందింది, దానితో సాయిరెడ్డి అసలు రాజకీయాలకే కొంతకాలం తాత్కాలిక వాలంటరీ రెటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు వైసీపీ లో హాట్ టాపిక్ అయిన అంబటి అరెస్టు వ్యవహారం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.
దీనితో అంబటి పేరు అటు పార్టీలోను ఇటు రాష్ట్ర రాజకీయాలలోను విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. అలాగే అంబటి కూడా తగ్గేదెలా అంటూ కూటమి ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటూ తొడకొట్టడానికి సిద్ధమయ్యారు. నాటి అరెస్టు కు ముందు నేడు బెయిలు తరువాత కూడా అంబటి స్పీడ్ లో ఏమాత్రం మార్పు లేదు.
దీనితో ఇప్పుడు వైసీపీ లో అంబటి రాంబాబు తనకంటూ ఒక సొంత ఇమేజ్ సృష్టించుకోవడంలో సక్సెస్ అయ్యారు. మరి వైసీపీ లో జగన్ కు సరిసమానంగా కానీ జగన్ ను మించి కానీ ఎవరైనా స్పెషల్ మైలేజ్ సాధిస్తే అందుకు వైసీపీ రాజ్యాంగం నుంచి వచ్చే రిటర్న్ గిఫ్టులు అంబటి కోసం ఎదురుచూస్తున్నట్టేనా.?
అంబటి పరిస్థితి కూడా నాటి షర్మిల మాదిరో, విజయలక్ష్మి లెక్కో, సాయిరెడ్డి తరహానో మూల్యం చెల్లించడానికి సిద్డమయినట్టేనా.? మరి ఈ విషయంలో వైసీపీ తగ్గుతుందా.? లేదా అంబటి తలోగ్గుతారా.?
NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…
Team India started the T20I series against West Indies with a complete performance in Lucknow.…