
నేడు శాసనసభలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రసంగాన్ని ట్యాగ్ చేస్తూ వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు చిన్న ట్వీట్ చేశారు.
స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రసంగంలో “భవిష్యత్‌లో ఎవరు అధికారంలోకి వచ్చినా అమరావతిని ఏం చేయకుండా తీర్మానం చేశాం,” అని అన్నారు. ఆ లైన్ ట్యాగ్ చేస్తూ అంబటి రాంబాబు ‘అర్దమైపోయిందా?’ అని ట్వీట్ చేశారు. అది ఒక పదమే కానీ దానిలో చాలా పెద్ద అర్ధమే ఉంది.
వచ్చే ఎన్నికలలో కూటమి ఓడిపోతుందని వారికీ అర్దమైంది. ఆ భయంతోనే ఈ తీర్మానం చేస్తున్నారని అంబటి రాంబాబు ఈవిధంగా అభిప్రాయం వ్యక్తం చేశారు.
వచ్చే ఎన్నికలలో కూటమి గెలుస్తుందా ఓడిపోతుందా? అనే విషయం పక్కన పెడితే, ఒకవేళ ఓడిపోయి మళ్ళీ జగన్ వస్తే మళ్ళీ విశాఖ రాజధాని అనకుండా కట్టడి చేసేందుకే అమరావతికి ఈ రక్షణ అవసరమని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అందుకే నేడు ఈ తీర్మానం చేసిందనేది వాస్తవం. ఒకవేళ వైసీపీ-జగన్ భయం లేకపోయి ఉంటే ఈ తీర్మానం అవసరమే ఉండేది కాదు కదా?
కనుక ఈ తీర్మానం ద్వారా కూటమి ప్రభుత్వానికి లోలోన ‘ఓటమి భయం’ ఉందనే విషయం బయటపెట్టుకుంది. వచ్చే ఎన్నికలలో వైసీపీ గెలిచి మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమని అంబటి రాంబాబు అభిప్రాయం.
ఏది ఏమైనప్పటికీ కూటమి ప్రభుత్వానికి ఈ భయం ఉండటం చాలా అవసరమే. అప్పుడే మరింత చురుకుగా, సమర్ధంగా, తెలివిగా పనిచేస్తుంది.
మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందనే భయం టీడీపికి కల్పించగలిగింది వైసీపీ. కానీ తప్పకుండా గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పేందుకు వైసీపీ వద్ద బలమైన కారణాలు ఏవైనా ఉన్నాయా?
Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…
After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…