
‘మీ కార్యాచరణను ప్రారంభించండని ఆయన నన్ను ప్రోత్సహించారు. ఇజాల గురించి పట్టించుకోవద్దు.. ప్రజల ఆకాంక్షే మీ రాజకీయ విధానంగా చేసుకోండని చెప్పారు. ప్రజలకు ఏది అవసరమో అదే చేయండి.. సంక్షేమ పథకాల జాబితా సిద్ధం చేసుకోండని సూచించారు. ఆయన అలా చెప్పడం నాకెంతో మనోధైర్యాన్నిచ్చింది. నాలో పట్టుదల రేపింది. ఆయన సిద్ధాంతాలు అందరికీ నచ్చుతాయి. చంద్రబాబు మాటలు శిరసావహిస్తాను’ అని కమల్ పేర్కొన్నారు.
పార్టీ పెట్టేవారెవరూ నిద్రపోరని, అయితే చంద్రబాబు ఇచ్చిన భరోసాతో రాత్రి హాయిగా నిద్రపోయానని చెప్పారు. అయితే కమల్ చేసిన ఈ వ్యాఖ్యలు బీజేపీ హై కమాండ్ కు రుచించడం లేదట. వ్యతిరేక శక్తులకు దగ్గరవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారా అని అమిత్ షాకు అనుమానం కలిగిందంట.
కొంతకాలం క్రితం ఆయన మిత్రపక్షమే అయినా, బిజెపిపై విమర్శులు చేస్తున్న శివసేన అదినేత ఉద్దావ్ ఠాక్రేతో మాట్లాడారని వార్తలు వచ్చాయి. తాజాగా బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కమల్ తో మాట్లాడి దిశానిర్దేశం చెయ్యడం అమిత్ షాకు కంటగింపుగా మారిందట. బీజేపీకి పూర్తి విరోధులైన డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేరళ ముఖ్యమంత్రి విజయన్ లు కూడా కమల్ హసన్ కార్యక్రమంలో ప్రత్యక్షంగా, వీడియో కాన్పరెన్స్ ద్వారా పొల్గొన్నారు. ఈ సభకు చంద్రబాబుకు కూడా ఆహ్వానం వచ్చినా బీజేపీ వారి ఇన్సెక్యూరిటీ గ్రహించి దానికి దూరంగా ఉన్నట్టు సమాచారం.
Shivangi Verma raises the fashion bar with a striking ethnic look that blends timeless elegance…
Kollywood film Anbe Diana starring Pari Elavazhagan in the lead and directed by him, was…