జూనియర్ దేవరకొండ… అదేం స్పీడ్ బాబోయ్?

Anand Deverakonda Midlle Class Melodiesవిజయ్ దేవరకొండ సోదరుడు, ఆనంద్ దేవరకొండ తన రెండవ చిత్రాన్ని ప్రకటించడం ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచారు. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ పేరుతో ఉన్న ఈ మూవీకి కొత్తగా వినోద్ అనంతోజు దర్శకత్వం వహిస్తున్నారు. అసలు ఉలుకుపలుకు లేకుండా మొదటి కాపీ సిద్ధంగా ఉందని నిర్మాతలు చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు.

అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ యంగ్ హీరో తన మూడవ ప్రాజెక్ట్ యొక్క 75% షూటింగ్ కూడా పూర్తి చేశాడు. ఈ చిత్రానికి కొత్తగా వచ్చిన శ్రీజన్ అనే కుర్రాడు దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ థ్రిల్లర్‌గా రోపొందుతున్న ఈ చిత్రంలో నటుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కనిపించనున్నారు.

ADVERTISEMENT

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు సీనియర్ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఆనంద్ దేవరకొండ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. నటుడు తన సినిమాలను సూపర్ వేగంతో పూర్తి చేస్తున్నట్లు కనిపిస్తోంది. దానికి మెచ్చుకోవాల్సిందే. అతని మొదటి చిత్రం దొరసాని జూలై 2019 లో విడుదలైంది.

అంటే ఒక సంవత్సరంలో అతను దాదాపు రెండు చిత్రాలను పూర్తి చేశాడు. లాక్డౌన్ అంతరాయం లేకపోతే మూడవ చిత్రం పూర్తి అయి ఉండాలి. సంక్రాంతికి మిడిల్ క్లాస్ మెలోడీస్ విడుదలయ్యి, ఇంకో చిత్రం కూడా ఈ ఏడాదిలోనే విడుదల చేసే వాడు. అలా ఇండస్ట్రీకి వచ్చిన రెండో ఏడాదిలోనే అతనికి రెండు సినిమా రిలీజ్లు ఉండేవి.

ADVERTISEMENT
Latest Stories