కాన్సెప్ట్ అదిరింది గురూ… కొత్తదనం అంటే ఇదే..!

anando-brahma-concept -videoఈ నెల 18వ తేదీన విడుదల కాబోతున్న “ఆనందో బ్రహ్మా” సినిమా ప్రమోషన్ ప్రారంభమైంది. ఫస్ట్ లుక్ నుండి ట్రైలర్ వరకు అన్నీ ఆకట్టుకునేలా విడుదల చేసిన చిత్ర యూనిట్, తాజాగా ‘కాన్సెప్ట్ వీడియో’తో పబ్లిసిటీని పతాక స్థాయికి తీసుకువెళ్ళింది. ఇప్పటివరకు చేసిన ప్రమోషన్ కార్యక్రమాలు ఒకెత్తు అయితే, ఈ ‘కాన్సెప్ట్ వీడియో’ మరో ఎత్తులా కనపడుతోంది.

‘ఆనందో బ్రహ్మా’ సినిమా కధ ఎటువంటి నేపధ్యంలో తెరకెక్కింది అనే కాన్సెప్ట్ లో తయారైన ఈ వీడియోలో… ఓ దెయ్యానికి తాప్సీ డీల్ ఇవ్వడం అనేది హైలైట్ గా కనపడుతోంది. ఒక ఇల్లు ఖాళీ చేయించడానికి ఓ ఆడ దెయ్యానికి ఇచ్చిన డీల్ కొత్తదనాన్ని పంచుతోంది. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ వీక్షకులను విపరీతంగా అలరిస్తుందని చెప్పడంలో సందేహం లేదు.

ADVERTISEMENT

‘దేవుడ్ని నమ్మాను… పనవ్వలేదు, మనుషుల్ని నమ్మాను… పనవ్వలేదు, అందుకే ఈ ఎస్సైన్ మెంట్ నీకు ఇచ్చాను.., మేల్ డామినేషన్ లేని ఏకైక ప్రొఫెషన్ మాది…’ వంటి సింపుల్ డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. సాధారణంగా దెయ్యాలు కనపడగానే వచ్చే భారీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా… ఆహ్లాదకరంగా కనపడుతోన్న ఈ వీడియో కాన్సెప్ట్ అదిరిందనే చెప్పాలి.

ADVERTISEMENT
Latest Stories