ప్రీ లుక్ – ఇంటరెస్టింగ్ గా ఉందే!

Anando bramha First look Postersకొత్త దర్శకుల చేతిలో తెలుగు సినిమాకు ఉజ్వల భవిష్యత్తు ఉందన్న నమ్మకం ఇప్పుడిప్పుడే బలపడుతోంది. ఒకప్పుడు తెలుగు సినిమా ఏమైపోతుందా… అని విచారం వ్యక్తం చేసిన దాసరి వంటి వారే, ఇటీవల కాలంలో స్పందిస్తూ… తెలుగు సినిమాకు బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉందని కితాబిస్తున్నారు. అంత నమ్మకం కలిగిస్తున్న సినిమాలు వరుసగా నిర్మాణం అవుతుండడమే ప్రధాన కారణం. అదే బాటలో ఈ పోస్టర్ తో విడుదల చేసిన సినిమా కూడా పయనిస్తుందన్న నమ్మకం వ్యక్తమవుతోంది.

నేరుగా ‘టైటిల్’ను చూపించకుండా, ‘మిర్రర్ వ్యూ’లో విడుదల చేస్తూ… టైటిల్ ను చెప్తే, హీరోయిన్ తాప్సీతో సెల్ఫీ అంటూ చిత్ర యూనిట్ వదిలిన బంపర్ ఆఫర్ కు నెటిజన్లు కొద్ది సెకన్ల వ్యవధిలోనే “ఆనందో బ్రహ్మ” అంటూ రిప్లై ఇచ్చారు. మే 28వ తేదీన ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నట్లుగా వదిలిన ఈ ప్రీ లుక్ పోస్టర్ వీక్షకులను ఆకట్టుకుంటోంది. పోస్టర్ ఏమో భయంకరంగా డిజైన్ చేసి, ‘భయానికి నవ్వంటే భయం’ అన్న ట్యాగ్ లైన్ రాయడంతో, ఇది హార్రర్ కామెడీ అన్న విషయం అర్ధమవుతోంది.

ADVERTISEMENT

గతంలో ‘విలేజ్ లో వినాయకుడు, కుదిరితే కప్పు కాఫీ, పాటశాల’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన మహి వి రాఘవ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, ‘భలే మంచి రోజు’ బ్యానర్ నుండి ఈ సినిమా వస్తోంది. చిత్రంలోని నటీనటులు ఎవరన్నది ప్రకటించకుండా సస్పెన్స్ లో ఉంచినప్పటికీ, తాప్సీతో సెల్ఫీ అంటే ప్రధాన పాత్రలో తాప్సీ నటిస్తోందన్న విషయం దాదాపుగా ఖరారైనట్లే. అలాగే ‘భలే మంచి రోజు’ సినిమా హీరో సుధీర్ బాబు ఈ పోస్టర్ ను విడుదల చేయడంతో హీరోగా సుధీర్ నటిస్తున్నాడన్న విషయం చెప్పకనే చెప్పాడు.

ADVERTISEMENT
Latest Stories