సోకు… షాకు… అనసూయకే చెల్లింది

Anchor Anasuya bharadwaj item song in Chaavu Kaburu Challagaసహజంగా టీవీ యాంకర్లు సినిమాలలో నటించి సక్సెస్ కావడం చాలా అరుదు. అయితే అనసూయ మాత్రం చాలా జాగ్రత్తగా తన కెరీర్ ని ప్లాన్ చేసుకుంటుంది. ఒక్కో సారి గ్లామర్ గా స్పెషల్ సాంగ్లు చేస్తూనే… మిగతా సమయాలలో పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలను పిక్ చేసుకుంటుంది.

ADVERTISEMENT

ఆమె తదుపరి చిత్రం థాంక్ యూ బ్రదర్ లో ఆమె గర్భిణీగా కనిపించి షాక్ ఇచ్చింది. తాజాగా ఆమె కార్తికేయ హీరోగా నటిస్తున్న చావు కబురు చల్లగా అనే సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. ఆ పాటకు సంబంధించిన రెండు హాట్ ఫోటోలు చిత్రబృందం విడుదల చేసింది.

తమ సినిమాలో అనసూయ ఓ మాస్ మ‌సాలా ఐట‌మ్ సాంగ్ లో చిందేశారని.. అవుట్ అండ్ అవుట్ మాస్ బీట్స్ తో సాగే ఈ పాట‌ను త్వ‌ర‌లోనే విడుద‌ల చేస్తామ‌ని చిత్ర బృందం తెలిపింది. అటు థాంక్ యూ బ్రదర్ లో షాక్ ఇచ్చే పాత్ర… ఇటు చావు కబురు చల్లగా లో తన సోకు చూపించడం వంటి రెండు విభిన్న కోణాలను ఆవిష్కరించడం ఒక్క అనసూయకే చెల్లింది.

మరోవైపు… ఈ సినిమాలు కాకుండా అనసూయ మరో నాలుగు సినిమాలలో కీలక పాత్ర పోషిస్తున్నారు. థాంక్ యూ బ్రదర్ తో పాటు మిగతా నాలుగు సినిమాలు పూర్తిగా భిన్నమైన సినిమాలు కావడం విశేషం. బహుశా టీవీ యాంకర్లలో అనసూయ సక్సెస్ అయినంతగా మిగతావారు సక్సెస్ కాకపోవడానికి కారణం అదేనేమో.

ADVERTISEMENT
Latest Stories