Telugu

గుంటూరు కుర్రోడు – భీమవరం బుల్లోడు…

తెలంగాణ రాజకీయాలలో ఆంధ్రప్రదేశ్ పేరు ఎప్పుడు ఒక హాట్ టాపిక్ యేఅని చెప్పాలి. ఇటు ప్రతిపక్ష బిఆర్ఎస్ రాజకీయానికి ఆంధ్రా పేరు పునాది కాగా అటు అధికార కాంగ్రెస్ కి ఆంధ్రా జపం అవసరం. ఇలా ఈ రెండు పార్టీలు కూడా తమ తమ రాజకీయ లబ్ది కోసం ఏపీ పేరు కేంద్రంగా రాజకీయాలు నడుతాయి.

అయితే రెండేళ్ల సుదీర్ఘ కాలం తరువాత ఫామ్ హౌస్ నుంచి బయటకొచ్చిన కేసీఆర్ అధికార కాంగ్రెస్ పార్టీ పైనా, ఆంధ్రా సీఎం చంద్రబాబు మీద విరుచుకుపడ్డారు. నీ గురువు మాదిరే నువ్వు కూడా అంటూ బాబు, రేవంత్ లను ఉద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు గాను, ఓటుకి అంటూ అంటూ కేటీఆర్ చేసిన రెచ్చకొట్టే రాజకీయానికి గాను రేవంత్ తనదైన స్టైల్ లో వారికీ కౌంటర్ ఇచ్చారు.

ADVERTISEMENT

ఈ నేపథ్యంలో మా తెలంగాణ, ఆంధ్రోళ్ల పెత్తనం అంటూ పదే పదే రెండు రాష్ట్రాల మధ్య ప్రాంతీయ వాదాన్ని రెచ్చకొట్టే కేటీఆర్ కి కౌంటర్ గా నువ్వు ఆంధ్రాలోని గుంటూరు లో చదువు కోలేదా.? ఆంధ్రా పొలిటికల్ లీడర్లతో తెరచాటు రాజకీయ స్నేహాలు నడపడలేదా అంటూ కేటీఆర్ ని “గుంటూరు కుర్రోడి”గా అభివర్ణించారు రేవంత్.

దీనితో ఇక ఇప్పుడు నా వంతు అంటూ బయటకొచ్చిన కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ ను “భీమవరం బుల్లోడు” అంటూ మొదలు పెట్టారు. నేను గుంటూరు లో చదువుకున్నా, అమెరికాలో చదువుకున్నా, అయితే అందుకు నీకొచ్చిన సమస్య ఏమిటి.?

నీలా నేను చదువు, సంధ్య లేకుండా తిరగలేదు, నా తండ్రిని తిడితే నాకు రోషం రాదా.? రేవంత్ అంటే నాకు పీకల దాకా కోపం ఉంది. నేను గుంటూరు లో చదువుకుంటే, నువ్వు నీ అల్లుడిని భీమవరం నుంచి తెచ్చుకోలేదా.? అంటే ఇప్పుడు నిన్ను భీమవరం బుల్లోడు అంటూ సంబోధించాలా.? అంటూ రేవంత్ కి కేటీఆర్ స్టయిలే కౌంటర్ పడింది.

అయితే తెలంగాణ రాజకీయ నాయకులు తమ రాజకీయ ప్రత్యర్థులను విమర్శించడానికి కూడా ఇలా ఆంధ్రా పేరును వాడుకోవడం చూస్తుంటే తెలంగాణ రాజకీయ పార్టీలకు ఆయా పార్టీల నాయకులకు ఆంధ్రా అనేది ఒక రాజకీయ పునాది లాంటిదని, అది వారి రాజకీయానికి ఒక ఆక్సిజన్ వంటిదని స్పష్టమవుతుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

After Bloody Romeo, Nani Wants a Clean Break

Nani seems ready to move away from the A-certificate zone, but he is not doing…

2 minutes ago

కనబడుట లేదు: 45 ఎకరాలు

ఫలానా అబ్బాయి లేదా అమ్మాయి కనిపించుట లేదు. మా పెంపుడు కుక్క కనిపించుట లేదు.. వంటి వార్తలు తరచూ చూస్తూనే…

24 minutes ago