బీజేపీలో వైసీపి కోవర్టులు, టిడిపి కోవర్టులు… అందుకే ఈ దుస్థితి

andhra-pradesh-bjp-contestants

బీజేపీలో వైసీపి కోవర్టులున్నారని టిడిపి, లేదు టిడిపి కోవర్టులే ఉన్నారని వైసీపి వాదించుకొంటున్నాయి. బీజేపీలోని సోము వీర్రాజు వంటి వైసీపి కోవర్టుల ద్వారా తనకు నర్సాపురం టికెట్‌ దక్కకుండా జగన్‌ అడ్డుకున్నారని రఘురామకృష్ణ రాజు బహిరంగంగానే చెప్పారు.

ADVERTISEMENT

ఈ ఎన్నికలలో టిడిపి, జనసేనలను ఓడించి మళ్ళీ అధికారంలోకి రావాలని చాలా పట్టుదలగా ఉన్న జగన్మోహన్‌ రెడ్డి, తన కోవర్టుల ద్వారా బీజేపీలో కూడా చక్రం తిప్పుతున్నారని రఘురామ తీవ్ర ఆరోపణ చేశారు.

బీజేపీ ఎంపీ టికెట్ల విషయంలోనే జోక్యం చేసుకొన్న జగన్, ఎమ్మెల్యే టికెట్ల విషయంలో దూరంగా ఉంటారనుకోలేము. కనుక తనకు నచ్చిన వారికి లేదా వైసీపి అభ్యర్ధులు సులువుగా ఓడించగలిగే వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించుకునేందుకు ప్రయత్నిస్తే ఆశ్చర్యం లేదు.

పైగా ఏపీలో బీజేపీ, టిడిపిల మద్య కనీసం బీజేపీ, జనసేనల మద్య బలమైన అనుబంధం కూడా లేదు. కనుక టిడిపి, జనసేనల సహాయ సహకారాలు ఉంటాయో లేదో తెలీదు. బలమైన బంధం, పరస్పర సహకారం లేకపోతే ఆ రెండు పార్టీల ఓట్లు బీజేపీ అభ్యర్ధులకు బదిలీ అయ్యే అవకాశాలు తగ్గిపోతాయి.

అప్పుడు బీజేపీ అభ్యర్ధులు సొంత బలంతో నెగ్గవలసి ఉంటుంది. బీజేపీ ఎంపీ అభ్యర్ధులలో అలాంటివారు ముగ్గురు మాత్రమే కనిపిస్తున్నారు. ఈ లెక్కన బీజేపీ కోల్పోయే ప్రతీ సీటు వైసీపికే దక్కుతుంటుంది.

అంటే బీజేపీలో కోవర్టుల వల్ల కావచ్చు లేదా ఇటువంటి ఇతర కారణాల వల్ల కావచ్చు ఆ మేరకు వైసీపి లబ్ధి పొందబోతోందని భావించవచ్చు.

ఇదేవిదంగా బీజేపీలో దగ్గుబాటి పురందేశ్వరి వంటి టిడిపి కోవర్టులు కూడా ఉన్నారని వారి ద్వారా చంద్రబాబు నాయుడు తనకు నచ్చని సోము, జీవీఎల్, పీవీఎన్ మాధవ్, విష్ణు వర్ధన్ రెడ్డికి టికెట్స్ దక్కకుండా చక్రం అడ్డేశారని వైసీపి నేతలు ఆరోపిస్తున్నారు. రేపు శాసనసభ అభ్యర్ధుల విషయంలో కూడా చంద్రబాబు నాయుడు చక్రం తిప్పి అడ్డుకుంటారని వైసీపి నేతలు ఆరోపిస్తున్నారు.

మొత్తంగా చూస్తే బీజేపీని టిడిపి, జనసేనలతో పాటు వైసీపి కూడా ప్రభావితం చేయగల స్థితిలో ఉందని ఈ ‘కోవర్టు’ ఆపరేషన్స్‌తో స్పష్టం అవుతోంది. ఏపీలో బీజేపీకి ఉన్న నిరాదరణకు తోడు, ఆ పార్టీ నేతలకు విశ్వసనీయత, పార్టీ పట్ల నిబద్దత లేకపోవడం కూడా ఆ పార్టీకి శాపమే.

బీజేపీ అధిష్టానం ఏపీలో మూడు పార్టీలను శాశిస్తూనే, మళ్ళీ వాటికి నచ్చిన్న అభ్యర్ధులను ఖరారు చేసుకోవడం చాలా విచిత్రమే కదా? ఏపీలో బీజేపీ ఎందుకు బలపడలేకపోతోంది? అంటే ఇదీ ఓ కారణం కాదా?

ADVERTISEMENT
Latest Stories