Telugu

ఏపీలో కాంగ్రెస్‌, వైసీపీలు పొత్తులు?

వైసీపి నేతలు జగన్ ఫోటోతోనే గెలుస్తామని చెప్పుకొంటున్నప్పటికీ గత ఎన్నికలలో వైసీపీని గెలిపించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్‌ సాయం తీసుకొన్న సంగతి అందరికీ తెలుసు. అయితే వచ్చే ఎన్నికలలో మా సంక్షేమ పధకాలతో అవలీలగా గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తామని వైసీపి మంత్రులు, నేతలు గట్టిగా చెప్పుకొంటున్నారు. కనుక వచ్చే ఎన్నికలలో వైసీపీకి ప్రశాంత్ కిషోర్ అవసరం లేదనే అనుకోవాలి.

పైగా ఆయన వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించే కాంట్రాక్ట్ తీసుకొంటున్నారు. కనుక కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు వైసీపీ సిద్దపడితే తప్ప ఆయన సాయం కోరలేదు. ఒకవేళ అందుకు సిద్దపడితే ఆయన వైసీపీకి స్నేహితుడవుతాడు లేకుంటే రాజకీయ శత్రువుగా మారుతాడు. కానీ కాంగ్రెస్‌తో చేతులు కలిపితే ఓ బాధ…కలపకపోతే మరో బాధ అన్నట్లుంది వైసీపీ పరిస్థితి.

ADVERTISEMENT

ఒకవేళ కాంగ్రెస్‌తో వైసీపీ చేతులు కలిపేందుకు సిద్దపడితే ముందుగా కేంద్రాన్ని శత్రువుగా మార్చుకొన్నట్లవుతుంది. అప్పుడు ఏమి జరుగుతుందో అందరికీ తెలుసు. రాష్ట్ర విభజన చేసి ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్‌ను కాంగ్రెస్ పార్టీ అగమ్యగోచరంగా మార్చిందని ఆనాడు వైసీపీ గట్టిగా వాదించింది. ఏపీ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించారు. ఆ తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. కనుక రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసిన ఆ పార్టీతో వైసీపీ పొత్తులు పెట్టుకొంటే ప్రతిపక్షాలు ఇదే అంశాన్ని తెరపైకి తెచ్చి కాంగ్రెస్‌,వైసీపీలకి వ్యతిరేకంగా ప్రచారం చేయవచ్చు. అప్పుడు వైసీపీని కూడా ప్రజలు తిరస్కరించే ప్రమాదం ఉంటుంది.

ఒకవేళ కాంగ్రెస్‌తో వైసీపీ ఎన్నికల పొత్తులు పెట్టుకోదలచుకోకపోతే అప్పుడు గతంలో వైసీపీని గెలిపించిన ప్రశాంత్ కిషోరే వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్‌ను గెలిపించుకొనేందుకు…వైసీపీని ఓడించేందుకు గట్టిగా ప్రయత్నిస్తారు. అప్పుడు ప్రశాంత్ కిషోర్‌ సారధ్యంలో వస్తున్న కాంగ్రెస్, టిడిపి, జనసేన, బిజెపి, వామపక్షాలను వైసీపీ ఒంటరిగా ఎదుర్కొని ఓడించాల్సి ఉంటుంది.

కానీ రాష్ట్రంలో పరిస్థితులు క్రమంగా వైసీపీకి వ్యతిరేకంగా మారుతున్నట్లు కనిపిస్తున్నాయి. జగనన్నకు ‘ఒక్క ఛాన్స్’ ఇస్తే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అన్నివిదాలా అభివృద్ధి చేస్తారనుకొంటే, నేటికీ మూడు రాజధానులంటూ రాజధాని లేని రాష్ట్రంగా మిగిల్చి నందుకు ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని పట్టించుకోకుండా సంక్షేమ పధకాల కోసం అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని దివాళా తీయిస్తూ, ప్రజలపై భారం మోపుతున్నందుకు ప్రజలలో వైసీపీ ప్రభుత్వం పట్ల చాలా అసహనంతో రగిలిపోతున్నారు. కనుక వచ్చే ఎన్నికలలో వైసీపీకి ఎదురీత తప్పదని స్పష్టం అవుతోంది. ఈ పరిస్థితులలో కాంగ్రెస్‌ స్నేహహస్తం అందుకొని, ప్రశాంత్ కిషోర్‌ సాయంతో మళ్ళీ అధికారంలోకి రావడమే మేలని వైసీపీ భావించవచ్చు.

ప్రశాంత్ కిషోర్‌ కూడా కాంగ్రెస్‌ బలంగా లేని రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలని కాంగ్రెస్‌ అధిష్టానానికి సూచించారు కనుక ఏపీలో తల్లి కాంగ్రెస్‌, పిల్ల కాంగ్రెస్‌ మళ్ళీ ఒకటవుతాయా? లేదా? తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

కేసీఆర్‌ కంటే చిన్నవాడు రేవంత్ రెడ్డి కానీ ఇంత విజ్ఞతతో…

నేడు ప్రధాని మోడీ హైదరాబాద్‌లో హెచ్ఐసిసిలో రూ. కోట్లు9,377 కోట్లు విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ…

20 minutes ago

Why Bhumi Pednekar Suddenly Quit Netflix’s The Royals 2?

Bhumi Pednekar has been at the centre of discussions on social media for quite some…

22 minutes ago