
నేడు ప్రధాని మోడీ హైదరాబాద్‌లో హెచ్ఐసిసిలో రూ. కోట్లు9,377 కోట్లు విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డితో సహా పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు.
వేదికపై ప్రధాని మోడీ, సిఎం రేవంత్ రెడ్డి పక్కపక్కనే కూర్చొని నవ్వుతూ మాట్లాడుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. అనంతరం సిఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ, “ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన ‘వికసిత్ భారత్’లో తెలంగాణ కూడా భాగస్వామిగా చురుకుగా పాల్గొంటుంది.
కేంద్ర ప్రభుత్వం సహాయసహకారం అందిస్తే తెలంగాణ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ప్రధాని మోడీ 2047 నాటికి భారత్ 30 ట్రిలియన్ డాలర్ల పటిష్టమైన ఆర్ధిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు. మన దేశం ఉమ్మడి లక్ష్యం ఇది. కనుక దానిలో 3 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపేందుకు తగిన ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు సాగుతున్నాము. ఈ లక్ష్యం సాధించేందుకు మా ప్రభుత్వానికి ప్రధాని మోడీ ఆశీర్వాదం చాలా అవసరం,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ఈరోజు సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరుగబోయే బిజేపి సభలో ప్రధాని మోడీ తన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తారని కూడా సిఎం రేవంత్ రెడ్డికి బాగా తెలుసు.
అయినా ప్రధాని మోడీతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పైగా తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోడీ ఆశీర్వాదం, కేంద్ర ప్రభుత్వం అండదండలు అవసరమని బహిరంగంగా ఆయన సమక్షంలోనే చెప్పారు. ఎన్నికలైపోయాయి కనుక ఇక రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధిపై దృష్టి పెడదామంటూ సున్నితంగా ప్రధాని మోడీకి సూచించారు కూడా.
మాజీ సిఎం కేసీఆర్ తాను గొప్ప రాజనీతిజ్ఞుడునని, అపర చాణక్యుడునని అనుకుంటారు. కానీ సిఎంగా ఉన్నప్పుడు ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనకు వస్తే ఎంత దారుణంగా అవమానించేవారో, హేళన చేసేవారో అందరూ చూశారు.
కానీ కాంగ్రెస్, బిజేపిలు జాతీయ, రాష్ట్ర స్థాయిలో కూడా బద్ధ శత్రువులు. పైగా పశ్చిమ బెంగాల్ తర్వాత తెలంగాణ తమ లక్ష్యమని, రేవంత్ రెడ్డిని గద్దె దించి అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని రాష్ట్ర బిజేపి నేతలు బహిరంగంగా చెపుతున్నారు.
కానీ సిఎం రేవంత్ రెడ్డి సంయమనం కోల్పోలేదు. ఒక రాష్ట్రాధినేతగా ఓ రాజనీతిజ్ఞుడులా చాలా హుందాగా, ప్రధాని మోడీ సంతృప్తి చెందేలా మాట్లాడారు.
కానీ 70-80 వేల పుస్తకాలు చదివిన గొప్ప మేధావిననుకునే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వంపై కత్తులు దూస్తూ తాను, తన కుటుంబం, తన పార్టీని నష్ట పరుచుకోవడమే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి కూడా నష్టం కలిగించారు. అయినా కూడా అహంకారంతో చేసిన తప్పులకు బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రం నష్టపోతే దానికీ కేంద్రాన్ని, ప్రధాని మోడీని నిందిస్తూ తప్పించుకున్నారు.
కానీ ఆయన కంటే వయసులో, అనుభవంలో చిన్న వారైన సిఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీతో ఇంట మర్యాదగా, హుందాగా వ్యవహరించారు. తద్వారా రాజకీయంగా తాను, తన పార్టీ, ప్రభుత్వం నష్టపోకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తూనే తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి దోహదపడేలా చక్కగా వ్యవహరించారు. ఇదే ఇద్దరికీ తేడా!
Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…
The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…