
Andhra Pradesh Emerges as a Leading Investment Destination
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతో రాష్ట్రం ఎంతగా నష్టపోయిందో అందరికీ తెలుసు. నాడు చాలా బాధాకరంగా అనిపించినప్పటికీ, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి చెందుతుండటంతో చాలా ఉపశమనం కలిగిస్తుంది.
అయితే వైసీపీ హయాంలో విలువైన ఐదేళ్ళ సమయం, దాంతో పాటు లక్షల కోట్ల అప్పుల వలన రాష్ట్రం మళ్ళీ తీవ్రంగా నష్టపోయింది. ఒకానొక సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ ఎప్పటికైనా కోల్కోగలదా?అని ప్రజలు ఆందోళన చెందారు.
తత్ఫలితంగా జగన్‌ను గద్దె దించి మళ్ళీ చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర పగ్గాలు, బరువు బాధ్యతలు అప్పగించారు. ఇది చాలా మంచి నిర్ణయమని కూటమి ప్రభుత్వం నిరూపిస్తోంది. మళ్ళీ అన్ని రంగాలలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధిస్తోంది. భవ్యమైన అమరావతి రాజధానితో అటు చిత్తూరు, నెల్లూరు నుంచి ఇటు శ్రీకాకుళం వరకు అన్ని జిల్లాలలో రకరకాల పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు, ఎయిర్ పోర్టులు, సీ పోర్టులు, పారిశ్రామిక వాడలు, వివిధ రకాల హబ్‌లు, ఉన్నత విద్యాసంస్థలు ఏర్పాటవుతున్నాయి. వీటితో రాష్ట్రంలో అన్ని జిల్లాలు సమాంతరంగా, శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.
ఒకప్పుడు పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలో 9వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 2వ స్థానానికి చేరుకుంది. దేశం మొత్తానికి వస్తున్నపెట్టుబడులలో ఇవి 25 శాతం కాగా, ప్రైవేటు రంగంలో పెట్టుబడుల ప్రతిపాదనలు ఏకంగా 328 శాతం పెరిగాయి.
అలాగే ఈ రెండున్నరేళ్ళలో రాష్ట్రంలో విదేశీ సంస్థల పెట్టుబడులు కూడా 92 మిలియన్ డాలర్ల నుంచి 600 మిలియన్ డాలర్లకు పెరిగాయి.
మిగిలిన ఈ రెండున్నరేళ్ళలో రాష్ట్రంలో జరిగే ఈ అభివృద్ధి పనులు, పూర్తవుతున్న ప్రాజెక్టులు, రాజకీయ సుస్థిరత వంటివన్నీ నిశితంగా గమనించే పెట్టుబడిదారులు, అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం ఖాయంగానే కనిపిస్తోంది. అప్పుడే పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలో నం.1 స్థానంలో ఆంధ్రప్రదేశ్ చేరుకుంటుంది.
కనుక రాష్ట్ర విభజన వలన ఆంధ్రప్రదేశ్ తాత్కాలికంగా నష్టపోయినా, దీర్గకాలంలో చాలా మేలే జరిగిందని చెప్పవచ్చు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళీ ఎటువంటి రాజకీయ ప్రయోగాలు చేయకుండా సంయమనం పాటించడం చాలా అవసరం. లేకుంటే కథ మళ్ళీ మొదటికి వస్తుంది.
Emraan Hashmi may have moved on to different kinds of roles, but his old 'serial…
నేడు విశాఖలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు చాలా ఆసక్తికరంగా సాగుతోంది. ఈ సదస్సులో సుమారు రూ.11 లక్షల…