
గత ప్రభుత్వం పరిశ్రమలు, పెట్టుబడులు విస్మరించి సంక్షేమ పధకాలతోనే కాలక్షేపం చేసింది. ఆ కారణంగా గత 5 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య గణనీయంగా పెరిగిపోయింది. కనీసం ప్రభుత్వ శాఖలు, ఉపాద్యాయ పోస్టుల భర్తీ కూడా చేయలేదు.
వాటి కోసం పట్టణాలలో హాస్టల్స్‌లో ఉంటూ, కోచింగ్ తీసుకుంటూ లక్షలాది మంది యువత ఎదురుచూపులు చూశారు. కానీ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేయకపోవడంతో వారి జీవితాలలో అత్యంత విలువైన 5 ఏళ్ళ కాలం వృధా అయ్యింది. పైగా తల్లి తండ్రులపై ఆధారపడటం వలన వారికీ భారంగా మారారు.
యువత, ప్రతిపక్షాలు జాబ్ క్యాలండర్ విడుదల చేయాలని కోరుతుంటే, జగన్ ప్రభుత్వం సంక్షేమ క్యాలండర్ విడుదల చేసింది. ఉద్యోగాల భర్తీకి కుంటి సాకులు చెపుతూ కాలక్షేపం చేసిందే తప్ప భర్తీ చేయలేదు.
గత ప్రభుత్వంలో బొత్స సత్యనారాయణ అయిష్టంగా విద్యాశాఖ మంత్రి పదవి చేపట్టారు. ఆ తర్వాత ఆయన ప్రమేయం ఏమీ లేకుండానే విద్యాశాఖలో సంస్కరణల పేరుతో చాలా జరిగాయి. చివరికి డీఎస్సీ ప్రకటన కూడా అలాగే వచ్చింది.
రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ లేవని చెపుతూ వచ్చిన గత ప్రభుత్వం, ఎన్నికలకు ముందు హడావుడిగా డీఎస్సీ ఎందుకు ప్రకటించింది?అంటే వాటి కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులను ప్రలోభపెట్టి వారి ఓట్లు పొందాలనే ఆలోచనతోనే కదా? కాకుంటే కూటమి ప్రభుత్వంలా అధికారంలోకి రాగానే డీఎస్సీ ప్రకటించి ఉండేది కదా?
నారా లోకేష్ ఏరికోరి విద్యాశాఖని తీసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 16,941 పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ ప్రకటించారు. అప్పుడే దానికి మూడు నెలల గడువు కూడా విధించారు. ఆ ప్రకారమే మొత్తం ప్రక్రియ పూర్తి చేసి నేడు పరీక్షలలో ఉత్తీర్ణులైన అభ్యర్ధులకు నియామక పత్రాలు అందించబోతున్నారు.
తమ చిత్తశుద్ధిని నిరూపించుకున్న మంత్రి నారా లోకేష్, ఈ కార్యక్రమాన్ని ఓ పండగలా జరుపుకోవాలని నిర్ణయించారు.
నేడు అమరావతిలో సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని అభ్యర్ధులకు నియామక పత్రాలు అందజేస్తారు. డీఎస్సీలో ఎంపికైన అభ్యర్ధులను మాత్రమే కాదు… వారి కుటుంబ సభ్యులకు కూడా ఆహ్వానించడం మరో విశేషం.
ఇదే సమయంలో ప్రతీ జిల్లా కేంద్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు పాల్గొంటారు. కనుక 16,941 అభ్యర్ధులు, వారి కుటుంబాల జీవితాలను మార్చేయబోతున్న ఈరోజు వారికి నిజమైన పండగగా నిలువబోతోంది. ప్రజల పట్ల, ముఖ్యంగా నిరుద్యోగుల పట్ల ప్రేమాభిమానాలు, నిబద్దత ఇలా ఉండాలి కదా?
Ranabaali marks the second collaboration between director Rahul Sankrityan and Vijay Deverakonda. Set against a…
It has been more than a couple of years since the formation of the NDA…