
The AP DSC row intensifies as YSRCP targets Nara Lokesh over alleged irregularities in teacher recruitment.
ఇటీవల కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద సీమ జిల్లాలకు చెందిన వందలాది మంది ఉపాధ్యాయులు సభ నిర్వహించి డీఎస్సీ పేరుతో వైసీపీ చేస్తున్న నీచ రాజకీయాలను ఖండించారు.
డీఏసీలో భర్తీ అయిన ఉపాధ్యాయులకు కనీస విద్యార్హతలు లేవని, దొంగ సర్టిఫికెట్లు పెట్టి మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేల సాయంతో ఉద్యోగాలు సంపాదించుకున్నారంటూ వైసీపీ తమని ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తే సహించబోమని ఉపాధ్యాయులు హెచ్చరించారు.
ఇలా జరుగుతుందని ఊహించకపోవడంతో వైసీపీ కంగుతింది. వెంటనే మాట మార్చి కొత్త రాగం అందుకుంది.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నిన్న ధర్మవరంలో నిర్వహించిన నిరసన ర్యాలీలో మాట్లాడిన మాటలే ఇందుకు ఉదాహరణ.
“ఈ డీఏసీ ద్వారా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులందరినీ మేము దొంగలనడం లేదు. వారిలో నకిలీ సర్టిఫికెట్లు, రికమండేషన్ లెటర్లతో చేరిన వారి గురించే ప్రశ్నిస్తుంటే మిగిలిన ఉపాధ్యాయులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు?
ఈ ప్రభుత్వం అవకతవకలకు పాల్పడేందుకే స్పోర్ట్స్ కోటాని 2 నుంచి 3 శాతానికి పెంచింది. దీనినీ మేము ప్రశ్నిస్తున్నాము. డీఎస్సీలో ప్రభుత్వం అనేక అవకతవకలకు పాల్పడింది కనుకనే మేము సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నాము,” అని అన్నారు.
ఇక్కడ కాస్త ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చెప్పుకోవాల్సి ఉంటుంది.
డీఎస్సీ-1998, డీఎస్సీ-2008ల పెండింగ్ కేసులు క్లియర్ అవడంతో 4,534+2,193 కలిపి మొత్తం 6,727 మందిని ఉద్యోగాలలోకి తీసుకుంది. ఆ తర్వాత 2024 వరకు ఒక్కసారి కూడా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయకుండా కాలక్షేపం చేసేసి ఎన్నికలకు ముందు 6,100 పోస్టల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కనుక అదీ పూర్తి చేయలేకపోయింది.
కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే డీఎస్సీ ప్రకటించి ఒకేసారి 16,000కి పైగా పోస్టులు భర్తీ చేసింది. అంటే వైసీపీ ఐదేళ్ళలో చేయలేకపోయిన పనిని కూటమి ప్రభుత్వం ఏడాదిన్నరలోనే చేసిందన్న మాట!
అంతేకాదు.. రాబోయే మూడేళ్ళలో మరొక డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం కూడా ఉంది. కనుక దీనిని వైసీపీ జీర్ణించుకోవడం చాలా కష్టమే.
సరిగ్గా ఇలాంటి సమయంలో ఢిల్లీలో సీజేపీ ఆందోళనలకు తలొగ్గి కేంద్ర మంత్రి రాజీనామా చేయడంతో వైసీపీకి మంచి ప్రేరణ కలిగించింది. అదేవిధంగా తాము కూడా ఆందోళనలు చేస్తూ మంత్రి నారా లోకేష్ చేత రాజీనామా చేయించగలిగితే, కూటమి ప్రభుత్వం బలహీనపడుతుందని వైసీపీ ఆశ పడుతున్నట్లుంది.
అంతేకాదు.. వైసీపీ చేస్తున్న ఈ ఆందోళనల వలన కూటమి ప్రభుత్వం మళ్ళీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలంటే భయపడే పరిస్థితి కల్పిస్తోంది కూడా. వైసీపీతో తలనొప్పులు దేనికని ప్రభుత్వం డీఎస్సీ తీయకపోతే నష్టపోయేది ఎవరు? దాని కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులే కదా?
స్పోర్ట్స్ కోటాని పెంచి క్రీడాకారులకు ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తే అది కూడా వైసీపీ జీర్ణించుకోలేక ఇలా దుష్ప్రచారం చేస్తోందనిపిస్తుంది. అంటే ప్రభుత్వానికి స్పోర్ట్స్ కోటా పెంచే అధికారం ఉండదా?
ఒకవేళ డీఎస్సీలో అవకతవకలు జరిగాయని వైసీపీ బలంగా నమ్ముతుంటే హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసి న్యాయపోరాటం చేయవచ్చు కదా? చేయకుండా రోడ్లపై ఆందోళనలు చేస్తోంది. ఎందుకు?అంటే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి మంత్రి నారా లోకేష్ చేత రాజీనామా చేయించేందుకే.. అని వైసీపీ నేతలే చెప్పుకుంటున్నారు కదా? అంటే డీఎస్సీ పేరుతో వైసీపీ చేస్తున్న పోరాటం దేనికో అర్దమవుతూనే ఉంది కదా?
Venkatesh-Trivikram’s Aadarsha Kutumbam AK 47 will miss its October 9 release. Producer Naga Vamsi confirmed…
స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో వైసీపీ క్యాడర్, లీడర్ అందరు ఎలర్ట్ గా ఉండాలని, ఏకగ్రీవాలకు ఎట్టి పరిస్థితులలోను ఆస్కారం…