
అంత అభివృద్ధి కార్యక్రమాలు చేసిన చంద్రబాబు నేటి దుస్థితి చూసి నివ్వెరపోయే పరిస్థితి తలెత్తింది. నేడు జడ్జి ముందు చంద్రబాబు చేసిన విజ్ఞప్తి చూస్తే, సాధారణ మనుషులే కళ్ళు చమర్చే పరిస్థితి. “తన సుదీర్ఘమైన 45 ఏళ్ళ రాజకీయ ప్రయాణంలో ఎన్నో ‘అభివృద్ధి’ కార్యక్రమాలు చేసానని, అలాంటి తనను ‘అన్యాయం’గా అరెస్ట్ చేసారని” ఆవేదన వ్యక్తం చేసారు.
తాను చట్టాన్ని ఎప్పుడూ గౌరవించే వాడినేనని, తనపై ఎలాంటి విచారణ జరపకుండా అరెస్ట్ చేసారని, ఈ వయసులో తనకు అతి పెద్ద శిక్ష వేసారని, కేవలం ఆరోపణలతో అరెస్ట్ చేసారని, నిర్ధారణ కాలేదని, చట్టానికి ఎవరికీ అతీతులు కారని, తనకు న్యాయం కావాలని కోరుకుంటున్నట్లుగా విజ్ఞప్తి చేసారు.
ఓ పక్కన అవినాష్ రెడ్డి లాంటి వైసీపీ యువ నాయకులు గుండెపోటు అని, తల్లికి బాలేదని “న్యాయ”బద్ధంగా బెయిల్ పై తిరుగుతుండడం, ఏడు పదుల వయసులో చంద్రబాబు ఏమో ఎలాంటి ఆరోగ్య కారణాలు చెప్పకుండా జైలులో ఉండడం అనేది చూస్తుంటే, ఏపీలో ‘అభివృద్ధి’ కంటే ‘అన్యాయమే’ గెలుస్తుందా? అన్న భావన రాజకీయ వర్గాలలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
Vijay Deverakonda has an interesting history at the box office with Rajinikanth. On two previous…
Crazy Kalyanam stars VK Naresh, Anupama Parameswaran, Tharun Bhascker and Akhil Uddemari of Raju Weds…