ఏపీలో మందుబాబులకు విముక్తి దక్కిందా..?

నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాటరీ పద్డతిలో వైన్ షాపుల కేటాయింపులు జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి గడిచిన పది రోజులలోనే అప్లికేషన్ రుసుము కింద 3396 మద్యం దుకాణాలకు గాను దాదాపు 1797 కోట్ల భారీ ఆదాయం సమకూరినట్లు సమాచారం.

ADVERTISEMENT

అయితే ఈ నెల 16 నుంచి లాటరీలో షాపులు దక్కించుకున్న వ్యాపారాలు వైన్ షాపులను ప్రారంభించనున్నారు. మందుబాబుల బలహీనతను ఆదాయంగా మార్చుకుని మళ్ళీ వాటికీ సంస్కరణలు అంటూ తియ్యటి మాటలు చెప్పిన వైసీపీ తన హయాంలో దేశంలో మరెక్కడా దొరకని లిక్కర్ బ్రాండ్స్ ను దింపి వినియోగదారుల ప్రాణాలతో వ్యాపారం చేసింది.

బూమ్ బూమ్…స్పెషల్ స్టేటస్…ప్రెసిడెంట్ మెడల్…పవర్ స్టార్…త్రీ క్యాపిటల్స్..ఇలా దేశంలో ఎక్కడ కనిపించని, వినిపించని పేర్లు ఏపీ మద్యం దుకాణాలలో దర్శనమిచ్చేవి. అయితే ఈ బ్రాండ్స్ అన్ని జగన్ కు సంబంధించిన అమాత్యులదే అనేది టీడీపీ నేతలు గత ఐదేళ్లుగా గగ్గోలు పెడుతున్నా, నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలు అరిస్తుంది అంటూ వైసీపీ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినా అప్పటి ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు.

అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ ‘జే’ బ్రాండ్స్ నుంచి మందుబాబులకు విముక్తి కల్పించి నాణ్యమైన మద్యాన్ని అందుబాటు ధరలలో అందిస్తాం అంటూ హామీ ఇచ్చారు బాబు. ఇప్పుడు ఆ హామీ అమలు దిశగా అడుగులు వేస్తూ రాష్ట్రంలో మద్యం పాలసీని మార్పు చేస్తూ అన్ని బార్లలోను, వైన్ షాపులలోను అన్ని రకాల నాణ్యమైన బ్రాండ్స్ లిక్కర్ ను అందుబాటులోకి తెచ్చింది కూటమి ప్రభుత్వం.

దీనితో మందుబాబుల హృదయాలు గెలుచుకున్నారు చంద్రబాబు అంటూ తమ ఆనందాన్ని వ్యక్తీకరిస్తున్నారు టాక్స్ పేయర్స్. అలాగే గత ఐదేళ్లుగా తమ ఉపాధిని కోల్పోయిన వారు సైతం ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం తిరిగి తమకు ఉపాధిని కల్పించింది అంటూ మద్యం వ్యాపారాలు కూడా ప్రభుత్వ నిర్ణయం పై తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. అంటే కూటమి ప్రభుత్వానికి ఒకే నిర్ణయంతో ఇద్దరి మద్దతు మద్దతు దక్కినట్లయ్యిందన్న మాట.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Mass H-1B Layoffs at Fortinet?

A Reddit post has gone viral for claiming that the cybersecurity firm Fortinet has laid…

2 hours ago

H-1B Applicant Arrested Over False Walmart Accusation

An Indian F-1 student finds herself in serious trouble. A misunderstanding at Walmart has left…

3 hours ago