
AP Local Elections and TDP-YSRCP Rivalry
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న స్థానిక ఎన్నికలు టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య యుద్ధ వాతావరణానికి తెరలేపాయి. అయితే ఇక్కడ అధికారం కోల్పోయిన వైసీపీ అధికారుల పై దౌర్జన్యాలకు పాల్పడుతుందని, అధికార టీడీపీ నేతల మీద దాడులకు తెగబడుతుందని టీడీపీ వాదిస్తుంటే,
చేతిలో ఉన్న అధికారాన్ని ఆయుధం గా మార్చుకుని, అధికారులను అడ్డుపెట్టుకుని టీడీపీ అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తోందంటూ వైసీపీ ఆరోపిస్తుంది. ఇలా ఎన్నికల ప్రక్రియ పై ఇరు పార్టీల నేతలు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నారు. అయితే ఇందులో వైసీపీ, టీడీపీ శ్రేణుల ఇద్దరి వాదనలోని కొంత వరకు వాస్తవాలు ఉన్న మాట యదార్ధం.
కొన్ని స్థానాలలో వైసీపీ తన రప్ప రప్ప రాజకీయంతో టీడీపీ శ్రేణుల మీద రెచ్చిపోతుంది, మరికొన్ని ప్రాంతాలలో నాటి వైసీపీ ప్రభుత్వం తాలూకా ఉన్న పాత రాజకీయ లెక్కలు సరిచేసేందుకు కొందరు టీడీపీ శ్రేణులు తగ్గేదెలా అంటూ దూకుడుగా ముందుకెళ్తున్నారు.
అయితే అసలు నాటి ఈ స్థానిక ఎన్నికల గెలుపు రేపటి ఫలితాలకు ప్రతిబింబాలుగా మారే అవకాశం ఉంటుందా.? అంటే ఒక్కసారి గత రాజకీయ చరిత్రను చూస్తే యిట్టె అర్ధమవుతుంది. 2021 వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా వైసీపీ నేతలు టీడీపీ శ్రేణుల పై దౌర్జన్యాలకు పాల్పడి కనీసం పార్టీ తరుపున నామినేషన్లు కూడా దాఖలు చేయనివ్వలేదు.
దీనితో అనేక ప్రాంతాలలో వైసీపీ ఏకగ్రీవాలతో స్థానిక ఎన్నికలలో నాటి ప్రతిపక్ష టీడీపీ పై రాజకీయంగా పై చేయి సాధించింది. దీనితో రాష్ట్రంలో టీడీపీ పని ఖతం, ప్రజలలో వైసీపీ పాలన పట్ల పూర్తి సంతృప్తి ఉందంటూ వైసీపీ జబ్బలు చరచుకుంది.
కట్ చేస్తే 2024 సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ 151 నుంచి 11 కి పడి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని విధంగా ఘోర ఓటమిని చవిచూసింది. నాటి స్థానిక ఎన్నికల ఫలితాలు ఏవి కూడా 2024 సార్వత్రిక ఎన్నికల పై ఎటువంటి ప్రభావాన్ని చూపలేకపోయాయి.
అలాగే నేడు కూడా అధికార టీడీపీ స్థానిక ఎన్నికల గెలుపు కోసం అతిగా ఆవేశ పడి వైసీపీ పై రాజకీయంగా పై చేయి సాధించాలని, సాధించామని నిరూపించుకోవడం అవసరమే కానీ అవి పార్టీ రాజకీయ మనుగడకు జీవన్మరణ సమస్య కాదు, కాకూడదు. నేటి ఫలితాలు రేపటి ప్రతిబింబాలుగా ఎప్పటికి ఉండవు, ఉండలేవు.
వాటిని దృష్టిలో పెట్టుకుని ఇరు పార్టీల శ్రేణులు తమ రామ రాజకీయ స్వార్ధం కోసం రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించకుండా, ఎవరి రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించకుండా ప్రజాస్వామ్య బద్దంగా రాజకీయాలు చేస్తూ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తే అవి వారి రాజకీయ భవిష్యత్ ను కవచంలా కాపాడుతుంది.
Chandrababu Naidu has sent a clear message to TDP rebels: withdraw your nominations or face…
కూటమి పొత్తుకు విఘాతం కలగకుండా స్థానిక ఎన్నికలు సజావుగా సాగాలని, పొత్తులో భాగంగా టీడీపీ శ్రేణులు రాజకీయ త్యాగాలకు సిద్ధం…