Telugu

జనసేనకు పరీక్ష.. వైసీపీకి గొప్ప అవకాశం!

టీడీపి-జనసేనల మద్య సీట్ల సర్దుబాట్లు కొలిక్కి వచ్చాయి. జనసేన కోరుకున్నట్లే విజయవాడ, ఏలూరు, కాకినాడ, శ్రీకాకుళం నగరపాలక సంస్థలు, మరో 24 పురపాలక సంఘాలు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

అలాగే బిజెపి కోరుకున్నట్లే ఒక నగరపాలక సంస్థ (రాజమహేంద్రవరం), 5 పురపాలక సంఘాలు లభించినట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT

సీట్ల సర్దుబాట్లు పూర్తయ్యేసరికి రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది.

ఈ నెల 28న మున్సిపల్‌ ఎన్నికలకు పోలింగ్‌ నిర్వహించి అక్టోబర్‌ 30న ఫలితాలు ప్రకటిస్తుంది.

ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత నవంబర్‌ 3న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు: పోలింగ్‌, నవంబర్‌ 5న ఫలితాలు ప్రకటిస్తుంది.

అవి ముగిసిన తర్వాత నవంబర్‌ 26, 29, డిసెంబర్‌ 2 తేదీల్లో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలకు పోలింగ్‌ నిర్వహిస్తుంది.

సీట్ల సర్దుబాట్లు దాదాపు పూర్తవగానే 2029 ఎన్నికలలో కలిసికట్టుగా పోటీ చేస్తామని మూడు పార్టీల నేతలు కలిసి స్టేట్‌మెంట్‌ ఇచ్చేశారు. అప్పటి వరకు కళ్ళు మూసుకొని కూర్చోవడం దేనికని వైసీపీ కూడా ఎన్నికలకు సిద్ధం అవుతోంది.

సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార పార్టీ/కూటమికే మెజార్టీ సీట్లు వస్తాయి. అయితే ఈసారి జనసేన పట్టుబట్టి కోరిన సీట్లు తీసుకుంది. కనుక కూటమి విజయంలో దాని శాతం ఎంత? అనేది చాలా కీలకంగా నిలుస్తుంది.

ఈ ఎన్నికలలో కూడా జనసేన వంద శాతం స్ట్రైక్ రేట్‌తో మళ్ళీ సత్తా చాటుకుంటే ఇక దానికి తిరుగులేదు. కానీ అరకొర సీట్లు గెలుచుకుని తనకు దక్కిన సీట్లను వైసీపీకి కట్టబెడితే, జనసేన తన నమ్మకం, తన బలం గురించి పునరాలోచన చేయాల్సి ఉంటుంది.

ఇక ఏకగ్రీవాలు జరిగితే ఆయా నియోజకవర్గాల వైసీపీ ఇన్‌ఛార్జ్‌లకు వచ్చే ఎన్నికలలో టికెట్స్ ఇవ్వనని జగన్‌ వార్నింగ్ ఇచ్చారు. కనుక దీనిని ఓ అవకాశమని కూటమి పార్టీలు పసిగట్టి ఏకగ్రీవాలు చేయగలిగితే, మాట తప్పని జగన్‌ ఆయా నియోజకవర్గాలలో బలమైన వైసీపీ నేతలను పక్కనపెడితే, అది కూటమి పార్టీలకు బోనస్ అవుతుంది.

ఇక సిఎం చంద్రబాబు నాయుడు పాలనలో అన్ని రంగాలు భ్రష్టు పట్టాయి. కూటమి ప్రభుత్వం అవినీతిలో మునిగి తేలుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణించింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి.

అమరావతి వద్దు మావిగన్‌ ముద్దు. డీఎస్సీలో అవకతవకలు జరిగాయి. కూటమి ప్రభుత్వంతో వేసారి పోయిన ప్రజలు జగన్‌ రాక కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు… వంటి రకరకాల వాదనలతో వైసీపీ హోరెత్తిస్తోంది.

కనుక తన ఈ వాదనలన్నీ నూటికి నూరు శాతం ప్రజాభిప్రాయాలేనని నిరూపించేందుకు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు వైసీపీకి చక్కటి అవకాశం. కనుక ఈ ఎన్నికలలో కూటమి పార్టీలను ఓడించి పడేస్తే ఇవన్నీ నిజమైపోతాయి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

‘జైలర్ 2’ సినిమా రివ్యూ: సెకండాఫ్ సిండ్రోమ్ తో బాధపడ్డ జైలర్ సాబ్!

చిత్రం: జైలర్ 2 M9 రేటింగ్: 2.5/5 విడుదల తేదీ: అక్టోబర్ 15, 2026 తారాగణం: రజనీకాంత్, ఎస్.జే.సూర్య, రమ్యకృష్ణ,…

21 minutes ago

Is Anupama’s Personal Pain Affecting Her Work?

Personal struggles can sometimes affect professional relationships, even when someone tries to keep the two…

33 minutes ago