Telugu

డీఎస్సీ వివాదం శుభం కార్డు లేదా.?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో నిత్యం మెగా డీఎస్సీ మీద ఎదోరకంగా చర్చ నడుస్తూనే ఉంటుంది. అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో డీఎస్సీ లో అక్రమాలు అంటూ వైసీపీ మెగా డీఎస్సీ ఆధారాలు అంటూ కూటమి ప్రభుత్వం ఒకరి మీద మరొకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటూనే వస్తున్నారు.

అయితే అసలు గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేని వైసీపీ కూటమి ప్రభుత్వం రాగానే విడుదల చేసిన మొదటి డీఎస్సీ టార్గెట్ గా ఎందుకు ఇంతలా విమర్శలు చేస్తుంది. డీఎస్సీ లో మంత్రి లోకేష్ అక్రమాలు, లోకేష్ డీఎస్సీ ఉద్యోగాలను అమ్ముకున్నారు అంటూ నిత్యం డీఎస్సీ చర్చను ప్రజల దృష్టిలో ఉంచేందుకు వైసీపీ ఎందుకంతలా ఆరాటపడుతుంది.?

ADVERTISEMENT

ఒకపక్క ప్రభుత్వం నుంచి మంత్రి నారా లోకేష్, అటు అధికారులు, చివరికి ఇటు డీఎస్సీ లో ఉద్యోగాలు సంపాధించిన ఉపాధ్యాయులు సైతం వైసీపీ ఆరోపణలను ఖండిస్తున్నా, కష్టపడి చదివి, పరీక్షలు రాసి సంపాధించుకున్న ఉద్యోగాల పై వైసీపీ శ్రేణులు నిరాధారమైన ఆరోపణలు చేస్తూ మమ్మల్ని అవమానిస్తున్నారు అంటూ ఉద్యోగులు రోడ్డెక్కినా వైసీపీ మాత్రం తగ్గేదెలా అంటూ నిత్యం ఈ అంశాన్ని చర్చలో ఉంచేందుకు శ్రమిస్తోంది వై.?

ఒక ఆరోపణను, విమర్శను నిత్యం ప్రజల ముందుకు తెచ్చి, పదేపదే ఒక వ్యక్తి టార్గెట్ గా రాజకీయం చేస్తే దాని ఏదోనాటికి ప్రజలు విశ్వసిస్తారు అనే భావనలోకి వైసీపీ వెళ్లిపోయిందా.? దమ్ముంటే డీఎస్సీ మీద జగన్ చర్చకు రావాలని అంటూ మంత్రి లోకేష్ సవాల్ చేస్తున్నా వైసీపీ ఇప్పటికి సవాల్ ని స్వీకరించి ముందుకు రాకుండా కేవలం ఆరోపణలకు పరిమితం అవుతుంది.

వైసీపీ వ్యూహాత్మకంగానే డీఎస్సీ లో అక్రమాలు, నారా లోకేష్ ఉద్యోగాలు అమ్ముకున్నారు అనే టాపిక్ ని నిత్యం లైవ్ లైట్ లో ఉంచాలని భావిస్తున్నట్టు కనిపిస్తుంది. తద్వారా లోకేష్ ను ప్రజలు ముందు దోషిగా నిలబెట్టాలని చూస్తుంది. అయితే డీఎస్సీ కేంద్రంగా వైసీపీ చేస్తున్న ఆరోపణలను, ప్రచారాలను ప్రజలు విశ్వసిస్తే రాష్ట్రంలో పరిస్థితులు ఇంత ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుందా.?

నేటి యువతరం ప్రభుత్వాలు తప్పు చేస్తున్నాయి, చేసాయి అని భావిస్తే దాని తాలుకా నిరసన ఏ స్థాయిలో చూపిస్తుంది అనేదానికి నీట్ పరీక్షా పత్రాల లీకేజ్ తో సీజేపీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీ జంతర్ మంత్రం కేంద్రంగా జరిగిన ఉద్యమాలు, దానిఫలితంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వంటి ఘటనలే ప్రత్యక్ష సాక్షాలు. మరి వైసీపీ డీఎస్సీ నిరసనలకు మద్దతుగా ఏపీలో ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయా అన్నది వైసీపీ గ్రహించాలి..!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Aditya Hasan: An EPIC Lesson for Budding Filmmakers

There were decent expectations for Epic. At the very least, audiences expected a passable one-time…

10 minutes ago

Haiwaan Public Talk: Akshay Kumar’s Film Dead on Arrival?

Haiwaan arrived in theatres after a long wait. Expectations were sky-high for a lot of…

25 minutes ago