
ప్రభుత్వం అంటే కేవలం సంక్షేమ బటన్లు నొక్కడం, ముఖ్యమంత్రి అంటే పార్టీ పనులను చక్కపెట్టడం అన్నట్టుగా సాగిన వైసీపీ పాలనకు పూర్తి భిన్నంగా వెళ్తుంది కూటమి ప్రభుత్వం.
ప్రభుత్వం అంటే సంక్షేమం తో పాటు అభివృద్ధి, ముఖ్యమంత్రి అంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అనేలా కూటమి పాలన ముందుకెళ్తుంది.
ఒకపక్క రాజధాని అమరావతి పనులను పట్టాలెక్కించి ప్రభుత్వం మరోపక్క రాష్ట్ర వ్యాప్త అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అందులో భాగంగానే విశాఖ ను ఐటీ హబ్ గా అమరావతిని ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చిదిద్దుతూ చిత్తూరు కేంద్రంగా శ్రీ సిటీ నిర్మాణాలు అనకాపల్లిలో లారెస్ వంటి ఫార్మా కంపనీల విస్తరణ పనులతో అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది.
వ్యాపార నగరంగా ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉన్న విజయవాడ తగినంత స్థాయిలో అభివృద్ధి చెందలేదని భావన అందరి మదిలోను ఉంది. అయితే ఆ భావనను మెట్రో రాకతో తొలగించేందుకు ముఖ్యమంత్రి బాబు ప్రణాళికలు రచిస్తున్నారు. విజయవాడను మరో మెట్రో సిటీగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది.
విజయవాడ మెట్రో రైలు నిర్మాణానికి ఏపీ మెట్రో కార్పొరేషన్ టెండర్లను ఆహ్వానించింది. ఫెజ్ ల వారీగా ఈ పనులను పూర్తి చేసేలా విధి విధానాలను రూపొందిస్తున్నారు. మొదటి ఫెజ్ లో భాగంగా 38.4 కి.మీ మేర 2 కారిడార్లలో మెట్రో నిర్మాణం చేపట్టనుంది.
కారిడార్ -1 లో భాగంగా పండిట్ నెహ్రు బస్ స్టేషన్ నుంచి గన్నవరం బస్ స్టాండ్ వరకు, కారిడార్ -2 లో బస్ స్టేషన్ నుంచి పెనమలురు వరకు నిర్మాణాన్ని చేపట్టనుంది. ఇక విజయవాడ మెట్రో తో ముందుకెళుతుంటే కర్నూల్ సోలార్ తో దూసుకుపోనుంది.
కర్నూల్ ఓర్వకల్లు లో అగస్త్య ఎనర్జీ ఇండస్ట్రీ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఇందుకు గాను ప్రభుత్వం 111.66 ఎకరాల భూ కేటాయింపులు జరపగా సంస్థ 6933 కోట్లతో సోలార్ ప్యానల్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయనుంది.
5 గిగావాట్ల సోలార్ సెల్, 5 గిగావాట్ల సోలార్ మాడ్యూళ్ల తయారీ యూనిట్లను రెండు ఫెజ్ లలో ఏర్పాటు చేసేందుకు సంస్థ ముందుకొచ్చింది. తద్వారా సుమారు 2 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. అయితే 2028 నాటికి ఉత్పత్తులు మొదలయ్యేలా సంస్థ ప్రణాళికలు వేస్తుంది.
అయితే గత ఐదేళ్లు బూతులు, దాడులు చూసిన ఆంద్రప్రదేశ్ నేడు అభివృద్ధి, ఉపాధి చూస్తుంది. నాడు రాష్ట్ర సరిహద్దులను చూడాలన్న భయపడ్డ పారిశ్రామిక వేత్తలు నేడు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి గా ముందుకొస్తున్నారు.
Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…
The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…