
పాముని చూస్తే అందరూ భయపడతారు. ఎందువల్లనంటే అది కాటేస్తే చనిపోతామనే భయం వల్లనే. కానీ అన్ని పాములు విషపూరితం కావని తెలిసి ఉన్నా పామును చూడగానే భయపడతారు.
ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎవరికీ అలాంటి భయాలు కూడా లేవు. ఎందువల్లనంటే ఏపీని ద్వేషించే వారికి అదొక వానపాములా కనిపిస్తుంది.. అది ఎన్నడూ ఎవరికీ అపకారం చేయదని అందరికీ తెలుసు కనుక.
ఈ ధీమాతోనే ఏపీని ద్వేషించేవారిలో కొంత మంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై బురద జల్లుతుంటారు. విపక్ష పార్టీ.. దాని సొంత మీడియా, దాని సోషల్ మీడియాలో మద్దతుదారులు పనిగట్టుకొని ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మంత్రుల మీద అనుచితంగా విమర్శలు చేస్తూనే ఉంటారు.
చివరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ప్రజలకు కూడా గర్వ కారణంగా నిలువబోతున్న రాజధాని అమరావతిపై నిరంతరం దుష్ప్రచారం కొనసాగుతూనే ఉంటుంది.
మరికొందరు ప్రజల కులమతాలు, భాష, సంస్కృతీ సాంప్రదాయాల గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటారు. కానీ ఎవరెన్ని అనుచిత విమర్శలు చేసినా ధీటుగా జవాబు రాదు.
ఇదేవిధంగా పొరుగు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు పదేపదే సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ల గురించి అనుచితంగా మాట్లాడుతున్నా సమాధానం ఇవ్వరు.
ఏపీ ప్రభుత్వం లేదా దాని మంత్రుల మౌనానికి బలమైన రాజకీయ కారణం ఉంది. అది అందరికీ తెలుసు. కానీ ఈ మౌనమే ఆంధ్రప్రదేశ్ అంటే అందరికీ చాలా అలుసుగా భావించేలా చేస్తోందని చెప్పక తప్పదు.
ఎవరి జోలికీ వెళ్ళకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటుంటే కొందరు పగబట్టినట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారు? అంటే దాని సహనం చాతగానితనంగా కనిపిస్తుంటుంది కనుక.
కానీ వారి మౌనాన్ని తక్కువ అంచనా వేసి ఎదురు దెబ్బలు తిన్నవారూ ఉన్నారు. ఉదాహరణకు రాష్ట్ర విభజన చేసినందుకు ప్రజలు కాంగ్రెస్ పార్టీని శిక్షించారు. కూటమి పార్టీలు, వైసీపీ తమ అభీష్టానికి విరుద్దంగా వ్యవహరిస్తున్నాయని భావించినప్పుడు నిర్దాక్షిణ్యంగా గద్దె దించేశారు.
అదేవిధంగా చంద్రబాబు నాయుడుని రాజకీయంగా దెబ్బ తీయాలనుకున్న బీఆర్ఎస్ పార్టీకి ఆయన భారీ ‘రిటర్న్ గిఫ్ట్’ ఇచ్చారు. ఆ పార్టీ దానిని స్వీకరించింది కానీ బయటకు చెప్పుకోలేక మౌనం వహించింది.
కనుక ఒక మనిషి లేదా సమాజం లేదా రాష్ట్రం లేదా దేశం సహనం, మౌనం చాతకనితనంగా భావించడమే ప్రమాదకరం.
Koffee with Karan may be ending but Karan Johar is not ready to say goodbye…
Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…