
ఆ తరువాత మాజీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ వెంటపడి వేదించడంతో ఆయన ఆత్మహత్య చేసుకొన్న సంగతి తెలిసిందే. విశాఖ మాజీ మేయర్ సంబ్బం హరి వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నందుకు ఆయన ఇంటి ప్రహారీ గోడను కూల్చివేసింది.
కానీ వైసీపీ ప్రభుత్వానికి టిడిపిపై ఈ రాజకీయ కక్ష నానాటికీ ఇంకా పెరుగుతోందే తప్ప తీరడం లేదనిపిస్తోంది. అందుకే నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్ ఇంటి ప్రహారీగోడను ఆదివారం తెల్లవారుజామున రహస్యంగా వెళ్ళి కూల్చివేశారు. దీనిపై హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసి స్టే విధించింది.
వైసీపీ ప్రభుత్వం ఈవిదంగా రాజకీయ కక్షసాధింపులకు పాల్పడి తమ ఇంటిని కూల్చివేసేందుకు ప్రయత్నించడాన్ని నిరసిస్తూ చింతకాయల విజయ్ నేడు నర్సీపట్నంలో దీక్ష చేపట్టారు. ఆయనకు మద్దతుగా వందలాది కార్యకర్తలు దీక్షలో కూర్చోన్నారు.
టిడిపి ‘ఛలో నర్సీపట్నం’ పిలుపు ఇవ్వడంతో పోలీసులు ఎక్కడికక్కడ టిడిపి నేతలను గృహనిర్బందం చేశారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇంట్లో నుంచి కదలకుండా భారీగా పోలీసులను మోహరించి గృహనిర్బందం చేశారు. అనకాపల్లి జిల్లా టిడిపి అధ్యక్షుడు బుద్దా నాగజదీశ్వరరావుని, విశాఖజిల్లా వెన్నెలపాలెంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని, తణుకులో ఆరిమిల్లి రాధాకృష్ణను, విజయనగరంలో మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడిని, పాడేరులో మాజీ మంత్రి కిడారి శ్రవణ్, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీలను పోలీసులు గృహనిర్బందం చేశారు. పలికేందుకు వివిద జిల్లాల నుంచి వస్తున్న టిడిపి నేతలను, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకొని అరెస్ట్ చేస్తున్నారు.
కానీ మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జీ, గోవింద్ వెంకట్ సత్యనారాయణ, కేఎస్ఎన్ రాజు, పలువురు మహిళా నేతలు పోలీసులను తప్పించుకొని నర్సీపట్నం చేరుకొని అయ్యన్నపాత్రుడు భార్య పద్మావతిని పరామర్శించి ధైర్యం చెప్పారు. అయ్యన్న కుటుంబానికి అండగా తామందరం ఉంటామని చెప్పారు.
ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే నర్సీపట్నంలో వేలాదిమంది పోలీసులు మోహరించడంతో నిన్నటి నుంచి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అయితే టిడిపి నేతలను భయపెడదామని వైసీపీ ప్రభుత్వం చేసే ఇటువంటి అనాలోచిత పనుల వలన టిడిపి మరింత ఉత్సాహంతో పోరాడేందుకు స్పూర్తి రగిలిస్తున్నామనే సంగతి వైసీపీ ప్రభుత్వం గ్రహించినట్లు లేదు. వైసీపీ ప్రభుత్వం చర్యల వలననే నర్సీపట్నంలో టిడిపికి బరిలో దిగి పోరాడవలసి వస్తోంది లేకుంటే ఇంత హడావుడి చేసి ఉండేదే కాదు కదా?
Chatrapathi is set to re-release in a 4K version this year on the occasion of…
Following the terrible failure of Retro, director Karthik Subbaraj made a comeback with his indie…