
సుమారు నెల రోజుల క్రితం షర్మిల భర్త బ్రదర్ అనిల్ రాజమండ్రిలో ఆయన ఇంటికి వచ్చి కలిసి వెళ్ళారు. బ్రదర్ అనిల్ ఏపీలో బడుగుబలహీన వర్గాల కొరకు కొత్త పార్టీ పెట్టాలనుకొంటున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయనకు ఉండవల్లి ఏమి సలహా ఇచ్చారో తెలీదు కానీ బ్రదర్ అనిల్‌తో భేటీ తరువాత ఉండవల్లి స్వరంలో మార్పు వినిపిస్తోంది.
సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సంక్షేమ పధకాలను ఎరగా వేసి రాజకీయ వ్యాపారం చేస్తున్నారని, మరో విదంగా చెప్పాలంటే తనకు బాగా అలవాటైన ‘క్విడ్ ప్రో’ చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సంక్షేమ పధకాలను ఉండవల్లి ‘క్విడ్ ప్రో’గా అభివర్ణించడం మామూలు విషయం కాదు.
బ్రదర్ అనిల్ నిజంగానే పార్టీ పెడతారా లేదా?దానిలో ఉండవల్లి చేరుతారా లేదా?అనేది అప్రస్తుతం. కానీ ప్రస్తుతం ఉండవల్లి వైసీపీతో యుద్ధానికి సిద్దం అవుతున్నట్లున్నారు. తమ సంక్షేమ పదకాలను ఉండవల్లి ‘క్విడ్ ప్రో’గా అభివర్ణించినందుకు వైసీపీ నేతలు తప్పకుండా ఆయనపై కత్తులు దూస్తారు. అప్పుడు ఆయన కూడా ఘాటుగా స్పందిస్తారు. వారి మద్య యుద్ధం మొదలైతే అది ఏ మలుపు తిరుగుతుందో ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో మున్ముందు తెలుస్తుంది.
నేడు ప్రధాని మోడీ హైదరాబాద్‌లో హెచ్ఐసిసిలో రూ. కోట్లు9,377 కోట్లు విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ…
Bhumi Pednekar has been at the centre of discussions on social media for quite some…