
నిజానికి ఈ ఆర్ధిక సంవత్సరం మొత్తానికి గానూ 37,000 కోట్ల అప్పులు చేయాల్సి వస్తుందని గత బడ్జెట్ లో రాష్ట్రం అంచనా వేసింది. కానీ 9 నెలల లెక్క తేలేపాటికే అప్పు 58 వేల కోట్లు దాటింది. ఈ అప్పులో ఉన్న మరో విశేషం ఏమిటంటే… రాష్ట్ర ఆదాయంతో దాదాపుగా సమానంగా ఉండడం.
అదే 9 నెలల్లో రాష్ట్రానికి వచ్చిన ఆదాయం 69,943 కోట్లు కాగా, ఇందులో 85% పైగా అప్పు సంఖ్య ఉండడం గమనార్హం. మొత్తంగా 9 నెలలకు గానూ లక్షా ముప్పై వేల కోట్లు ఖర్చు పెట్టగా, ఆ మొత్తం సంఖ్య రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధిని ప్రతిబింబించకపోవడం విశేషం.
ఖర్చు పెట్టిన మొత్తంలో అధిక శాతం సంక్షేమ పధకాల పేరుతో పంపకాలకు వెళ్లిపోతున్నాయి. తాజాగా బయటపడిన రెవిన్యూ లోటు లెక్కలతో మీడియా వర్గాలు కూడా ‘ఏపీ అధోగతి’ అంటూ పలు సంచలన కధనాలను ప్రసారం చేస్తున్నాయి. జగన్ యొక్క సువర్ణ పాలనకు నిదర్శనంగా దీనిని పేర్కొంటున్నారు.
ఇంత అప్పు చేసినా రాష్ట్రంలో సరైన రోడ్డు లేదు, ప్రభుత్వ ఉద్యోగులకు సరైన సమయానికి జీతాలు పడడం లేదు, అవ్వా తాతలకు 1వ తేదీన పెన్షన్లు రావడం లేదు, అలాగే రాష్ట్ర అభివృద్ధికి ఏ మాత్రం ఆస్కారం లేకుండా పాలన అందించడంలో జగన్ ది అందెవేసిన చేయిగా మీడియా వర్గాలు అభివర్ణిస్తున్నాయి.
ఇలా అప్పులు చేసుకుంటూ వెళితే, అదేదో సినిమాలో చెప్పిన మాదిరి రోజూ ఉదయం కాగానే, ఏపీ అప్పు “డే” తెల్లారిందా? అని రాష్ట్ర అధికారులతో పాటు ప్రజానీకం కూడా అనుకోవాల్సి వస్తుంది. ఈ రోజు ఏపీ ఎంత అప్పు చేస్తుందో అని చర్చించుకునే దయనీయ పరిస్థితి నెలకొంటుంది.
ఇప్పటికే ఒక్కొక్కరి నెత్తి మీద 6 లక్షలకు పైగా అప్పు ఉందని ప్రతిపక్ష అధినేత చంద్రబాబు నాయుడు నెత్తి, నోరు కొట్టుకుంటున్నారు. ఈ పరిస్థితిలో నుండి ఏపీ ఎలా బయటపడతారో తెలియదనే విధంగా ఉండవల్లి లాంటి రాజకీయ విశ్లేషకులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
After a long wait of seven years, the Student of the Year franchise is finally…
Megastar Chiranjeevi’s next release is Kaaka, directed by Bobby Kolli. The film marks the Telugu…