Telugu

సిఎం చంద్రబాబు అంటే ఇంత అలుసు.. దేనికంటే…

తెలంగాణలో బీఆర్ఎస్‌ పార్టీ నేతలు అవకాశం చిక్కినప్పుడల్లా సిఎం చంద్రబాబు నాయుడు గురించి వంకర మాటలు మాట్లాడుతూనే ఉంటారు.

తెలంగాణా ఏర్పడితే అన్ని సమస్యలు మంత్రదండం తిప్పి మాయం చేసినట్లు మాయం చేసేస్తానని కేసీఆర్‌ గొప్పలు చెప్పుకున్నారు. కానీ 12 ఏళ్ళ తర్వాత కూడా బీఆర్ఎస్‌ పార్టీ రాజకీయ మనుగడ కోసం నిత్యం చంద్రబాబు నాయుడు భజన చేస్తూనే ఉన్నారు.

ADVERTISEMENT

కాంగ్రెస్‌ పార్టీపై రాజకీయంగా పైచేయి సాధించలేక చంద్రబాబుని నిందిస్తూ, అయన పేరుతోనే రాజకీయ లబ్ది పొందాలనుకోవడం దౌర్భాగ్యమే కాదా?

చంద్రబాబు నాయుడు వల్లనే జగన్మోహన్ రెడ్డి పదవి, అధికారం కోల్పోయారు కనుక ఆయన కూడా ఆ బాధ, ఆవేశంతోనే నిత్యం ఆయనపై విమర్శిస్తూ, అవహేళన చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు.

కానీ తెలంగాణలో అధికార కాంగ్రెస్‌ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుథ్ రెడ్డి నోట అచ్చం వైసీపీ, బీఆర్ఎస్‌ నేతల మాటే వినిపించడం గమనిస్తే అయనపై వాటి ప్రభావం పడినట్లే ఉంది.

నిన్న ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ, “తెలంగాణలో వానలు పడటం లేదు. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. దీనికి అందరూ సిఎం రేవంత్‌ రెడ్డిని నిందిస్తున్నారు. కానీ రెండున్నరేళ్ళుగా రాష్ట్రంలో వర్షాలు బాగానే పడుతున్నాయి. మనకి బంగాళాఖాతం నుంచి వానలు రావాలి. కానీ అక్కడ ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయన ఉంటే వర్షాలు పడవు. కనుక ఈ కరువు చంద్రబాబు నాయుడు వలన ఏర్పడిందే తప్ప సిఎం రేవంత్‌ రెడ్డి వల్ల కాదు,” అని అన్నారు.

అక్కడ తెలంగాణలో ఎమ్మెల్యే అనిరుథ్ రెడ్డి చులకనగా మాట్లాడుతున్న సమయంలోనే ఇక్కడ ఆంధ్రాలో భారీగా వర్షాలు పడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా నేడు విశాఖ, విజయనగరం జిల్లాలలో పాఠశాలలకు సెలవు ప్రకటించాల్సి వచ్చింది.

కనుక ఆయనకు దేశవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం గురించి తెలియదన్న మాట! అనేక రాష్ట్రాలలో ఎండలు కొనసాగుతుంటే, మరికొన్ని రాష్ట్రాలలో భారీగా వర్షాలు కురుస్తూ భీభత్సం సృష్టిస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావం వల్లనే వారం రోజుల క్రితం వరకు ఆంధ్రప్రదేశ్‌లో వేసవిని తలిపిస్తూ ఎండలు కాసాయి. కనుక ప్రజలు సెప్టెంబర్‌ నెలలో కూడా ఏసీలు వాడుతున్నారు.

ఇప్పుడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటం వలన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పలు జిల్లాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఇంతకు ముందు తెలంగాణలో వర్షాలు భీభత్సం సృష్టిస్తే ఇప్పుడు అక్కడ ఎండలు కాస్తున్నాయి. ఇదే సమయంలో ఇక్కడ ఏపీలో వర్షాలు పడుతున్నాయి.

ఎల్‌నినో ప్రభావం వలన వాతావరణంలో కలిగిన ఈ మార్పుల గురించి సామాన్య ప్రజలకు కూడా తెలుసు. కానీ రాజకీయాలలో ఉన్నవారికే తెలియక ఈవిధంగా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.

అది చూసి ప్రజలు నవ్వుతుంటే, తమ వాక్చాతుర్యానికి మురిసి నవ్వుకుంటున్నారని సంతోషపడుతున్నారు. అందుకు వారిపై జాలి కలుగుతుంది.

సిఎం చంద్రబాబు నాయుడు అంటే అందరికీ ఇంత అలుసు దేనికంటే, అయన ఇలాంటి విమర్శలను పట్టించుకోరు. టీడీపి కూడా వాటికి ధీటుగా జవాబు చెప్పాలనుకోదు.

కనుక సిఎం చంద్రబాబు నాయుడుని ఉద్దేశ్యించి ఎంత చులకనగా మాట్లాడినా పర్వాలేదనుకునేవారే, ఈవిధంగా నోటికి పని చెపుతుంటారు. అలాంటి వారికి ప్రజలే రిటర్న్ గిఫ్టులు ఇస్తుంటారు. బహుశః అందుకే అయన పట్టించుకోవడం లేదేమో?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Nani Draws the Line: Reviews Are Not the Problem

Nani was asked a pointed question about The Paradise court order at the film’s Mumbai…

20 minutes ago

Vijay in Jailer2: Too Many Stars, Too Less Rajinikanth?

Rajinikanth's most anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar, is currently in the post-production…

51 minutes ago