అనిరుథ్ రెడ్డి నోట వైసీపీ నినాదాలు…వై.?

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తరువాత కూడా తెలంగాణలో రాజకీయ పార్టీల నాయకులు ఇప్పటికి ప్రాంతీయవాద రాజకీయాలకే ఆసక్తి చూపిస్తున్నారు. ప్రజల పేరు చెప్పుకుంటూ, ప్రాంతం పేరు వాడుకుంటూ తమ గుర్తింపు కోసం అవసరం లేని అంశాలలో కూడా కాస్త అతిగా ఆవేశపడి కొందమంది నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు.

అందులో అధికార టి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మెడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఒకరు. తాజాగా జనసేన vs నాగేశ్వరరావు అన్నట్టుగా సాగుతున్న వివాదంలోకి అనిరుధ్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. అసలు ఆంధ్రా నాయకులకు తెలంగాణ తో సంబంధం ఏమిటి.?

ADVERTISEMENT

ఆంధ్రా నాయకులంతా హైద్రాబాద్ లో ఉంటున్నప్పుడు ఏపీ ప్రభుత్వం అన్ని వేలకోట్లు ఖర్చు పెట్టి అమరావతిని నిర్మించడం ఎందుకు, అక్కడి నాయకులు అమరావతి ని వదిలి మెడ్చర్ల వస్తే, ఇక్కడే 5 వేల ఎకరాల భూమిని లీజుకిస్తాను,

అక్కడ ఏపీ రాజధానిని నిర్మించుకుని హైద్రాబాద్ నుంచే పాలనే చెయ్యొచ్చు అంటూ అసలు వివాదానికి సంబంధం లేని అంశాలతో ఆంద్రోళ్ళు అంటూ ఏపీ వారిని రెచ్చకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అనిరుధ్ తరహాలోనే రెండు రోజుల ముందు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ కూడా ఈ వివాదానికి ప్రాంతీయవాద రాజకీయ రంగు పూశారు.

ఏపీ నాయకులు ఇలానే తెలంగాణ మేధావుల మీద కేసులు, అరెస్టులు అంటూ తెలంగాణలోకి వస్తే మేమంతా గో బ్యాక్ ఆంధ్రా అనే నినాదాన్ని అందుకుంటే ఏమవుతుంది.? అంటూ ఇద్దరి వ్యక్తుల మధ్య మొదలైన వివాదాన్ని రెండు రాష్ట్రాల సమస్యగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు అనిరుథ్.

అలాగే జనసేన అధినేత పవన్ ను ఉద్దేశించి వైసీపీ ఉపయోగించే ప్యాకేజ్ స్టార్ నినాదాన్ని తెరమీదకు తెచ్చారు. బాబు ప్యాకేజ్ ఇస్తే టీడీపీ కి, అమిత్ షా ప్యాకేజీ ఇస్తే బీజేపీ కి మద్దతుపలికే పవన్ రేపటి రోజున వైసీపీ ప్యాకేజ్ ఇస్తే జగన్ కి మద్దతు తెలుపుతారేమో అంటూ పవన్ పై తనకున్న అక్కసును మరోమారు బయటపెట్టారు.

అలాగే అమరావతి నిర్మాణం ఎందుకు దండగా అంటూ అమరావతి నిర్మాణం కోసం అన్ని పైసలు ఎందుకు ఖర్చు చేస్తున్నారు అంటూ వైసీపీ మాదిరి అమరావతి పై అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారు. అనిరుథ్ వ్యాఖ్యలు, మందుల సామెల్ ప్రకటనలు చూస్తుంటే వీరి ఎజెండా వైసీపీ జెండా కోసమా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

గతంలో కూడా పవన్ పై ఇదేతరహా లో అనిరుధ్ రెచ్చిపోయారు. ఇక ఇప్పుడు నాగేశ్వరరావు కామెంట్స్ పై పవన్ స్పందిస్తేనే అదేదో ఇరు రాష్ట్రాల సరిహద్దుల సమస్యగా, తెలంగాణ రాష్ట్రానికి ఏపీ నాయకులు చేస్తున్న ద్రోహంగా చిత్రీకరిస్తున్న ఈ సోకాల్డ్ నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఉద్దేశించి వైసీపీ,చేస్తున్న విమర్శలకు కౌంటర్ వేసేందుకు కూడా ఏనాడు మీడియా ముందుకు రాలేరు.

రేవంత్ కష్టంతో వీరు అధికారం అనే హోదాను అనుభవిస్తూ కూడా వైసీపీ రేవంత్ పై వైసీపీ చేసే విమర్శలు…రేవంత్ బాబు మనిషి, రేవంత్ ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ, రేవంత్ తన గురువు బాబు ఆదేశాలతోనే ముందుకు వెళుతున్నారు,

రేవంత్ కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ టీడీపీ కోసం పనిచేస్తున్నారు అంటూ ఇలా వైసీపీ రేవంత్ టార్గెట్ గా రెచ్చిపోయిన అందుకు ప్రతిదాడి చేయడానికి కూడా ముందుకు రాలేని నేతలు రాజకీయ విశ్లేషకులు చేసే ఊహాగానాలను ఖండిస్తే మీడియా ముందుకొచ్చి అదేదో తెలంగాణ మీద పవన్ చేస్తున్న దాడిగా రెచ్చిపోతున్నారు, ఏపీ వారిని రెచ్చకొడుతున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

PVR INOX’s Rs 50 Cr Battle: Cost of Consecutive Disasters?

Veteran producer Vashu Bhagnani has invited another trouble for himself and his production house, Pooja…

34 minutes ago

Can Vijay’s Son Create Buzz on His Own After Jana Nayagan?

After a long wait, the makers of Sigma have officially announced the film's release date.…

1 hour ago