
సినిమా ఇండస్ట్రీ అందరికీ సాఫ్ట్ టార్గెట్. రాజకీయనాయకులు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, చిత్రసీమ అంటే చాలా చిన్నచూపు చూస్తుంటారు. చాలా ఈజీగా మాటలు అనేస్తుంటారు. మొన్నామధ్య కొండా సురేఖ పనిగట్టుకుని అక్కినేని ఫ్యామిలీ & సమతను టార్గెట్ చేసి అసహ్యమైన మాటలు అనడం కావచ్చు, ఇండస్ట్రీలోని నటీమణుల గురించి బయటవ్యక్తులు నీచమైన కామెంట్లు చేయడం కావచ్చు.. ప్రతిసారి ఇండస్ట్రీ అన్నా, ఇండస్ట్రీ మనుషులన్నా ఎందుకో చులకన. వెనక్కి తిరిగి ఒక మాట అనలేరు అనే ధైర్యం కూడా కారణం కావచ్చు.
ఇవాళ తెలంగాణ ఎమ్మల్యే అనిరుధ్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. “ప్రతి 90 రోజులకి ఇండస్ట్రీలో వాళ్లంతా బ్లడ్ టెస్టులు, డ్రగ్ టెస్టులు చేయించుకోవాలి. ఆ రిపోర్టులను బట్టి గద్దర్ అవార్డులు ఇవ్వాలి” అంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
పైపెచ్చు అదే సందర్భంలో “నేను అనడం లేదు కానీ బయట మాట్లాడుకుంటారు.. ఇండస్ట్రీలో ఈ డ్రగ్స్ అనేవి కామన్ అని” అంటూ బుకాయించడం కొసమెరుపు. అయినా.. ఆర్టిస్టులు లేదా ఇండస్ట్రీ వ్యక్తులు బ్లడ్ టెస్టులు చేయించుకొని, వాటి రిజల్ట్స్ పబ్లిక్ చేయాల్సిన అవసరం ఏముంది. జనాలకి ఆ రిపోర్టులు ఎలా ఉపయోగపడతాయి.
ముందు మైకుంది, వెనుక పార్టీ లోగో ఉంది, చేతిలో పదవి ఉంది కదా అని ఇలాంటి లేకి కామెంట్లు చేసి, రాజకీయనాయకులుగా, వ్యక్తులుగా వారి వారి స్థాయిని దిగజార్చుకోవడం తప్ప, వారికి అసలు ఏం ఒరుగుతుంది అనేది అర్థం కాని ప్రశ్న.
ఈ విషయమై స్పందించిన కొందరు, ఈ లెక్కన రాజకీయ నాయకులు కూడా ప్రతి 90 రోజులకి తమ బ్యాంక్ ఖాతాల స్టేట్మెంట్లను కూడా పబ్లిక్ ఫోరంలో పెట్టాలి, అప్పుడు వాళ్లు ఎంత నిజాయితీగా ఉంటున్నారు అనేది జనాలకి తెలుస్తుంది అని సూచించాడు. మరి అనిరుధ్ రెడ్డి ఈ సలహాకు ఎలా రెస్పాండ్ అవుతాడో చూడాలి.
India's 351/7 looked like a strong enough total, but the third ODI against West Indies…
Legendary filmmaker Singeetham Srinivasa Rao has passed away at Kauvery Hospital in Chennai following ill…