Telugu

రెడ్డి గారి ఇప్పసారా కి ఖుషి గుడుంబా నే స్ఫూర్తా.?

జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుథ్ రెడ్డి కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఉన్న రాజకీయ ఇబ్బందేమిటో.? ఆయనకు పవన్ పై ఉన్న ఆ వ్యక్తిగత అక్కసు ఏమిటో.? తెలియదు కానీ ఈ రెడ్డి గారు తనకు అవసరమైనప్పుడల్లా పవన్ పేరును బయటకు తీస్తున్నారు.

తాజాగా ఇప్పసారా విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రత్యర్థి పార్టీలకు ఆయుధాలుగా మారడంతో, ఆయన పై అటు తెలంగాణ రాజకీయాలలో విమర్శల జోరు ఇటు సోషల్ మీడియాలో ట్రోలింగ్ హోరు ఎక్కువయ్యింది. అయితే ఈ వివాదం నుండి తనను తానూ రక్షించుకోవడానికి అనిరుథ్ రెడ్డి అనవసరంగా పవన్ పేరును వాడుకుంటున్నారు.

ADVERTISEMENT

నేను సారా గురించి మాట్లాడితే నా పై విరుచుకుపడిపోతున్నారు కానీ సినిమా హీరోలు చేతిలో మందు గ్లాస్ పట్టుకుని అదొక హీరోయిజం కింద నటిస్తే మాత్రం ఎవరు ఏమి అనరు, అంతెందుకు మొన్నీమధ్య టీవిలో పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా చూసాను, అందులో హీరో పవన్, ఆలీ గుడుంబా తాగుతూ కనిపించలేదా.?

తెలంగాణలోని దూల్ పేట లో ఈ గుడుంబా ప్యాకెట్లు దొరుకుతాయి అంటూ మాట్లాడుతూ పవన్ తన సినిమాలో దూల్ పేట వారిని చిన్న చూపుగా చూపించలేదా, మరి అది తప్పుకానప్పుడు నాది తప్పేలా అవుతుంది అంటూ రెడ్డి గారు సినిమా సీన్లకు బయట ప్రజాజీవనానికి ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

అయినా సినిమాలో హీరో చేసే ప్రతి పని బయట రాజకీయ నాయకులు చేస్తారా.? అసలు అది సాధ్యమయ్యే పనేనా.? సినిమాని సినిమాలా చూడకుండా ఇప్పసారా ఆరోగ్యానికి మంచిది, సేవిస్తే తప్పేముంది అన్నట్టుగా మాట్లాడడమే కాకుండా మళ్ళీ ఆ పొరపాటును కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు పవన్ సినిమాలను తెరమీదకు తెస్తున్నారు.

అయినా సినిమాలలో హీరోగా పవన్ ఒక్కరే అలాంటి సీన్లలో నటించారా.? కానీ అనిరుథ్ కి పవన్ ఒక్కరే ఎందుకు కనిపించినట్టు.? ఆయనతో రెడీ గారికి ఉన్న సమస్యేమిటో కానీ ఇలా అర్ధం పర్ధం లేని వివాదాలలోకి పవన్ ను లాగడం అందులో నుంచి మరోకొత్త వివాదాన్ని వెతకడం తో రెడ్డి మరోసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి రెడీ గా ఉండాల్సిందేనెమో..!

గతంలో తెలంగాణ వారి దిష్టి అంటూ పవన్ చేసిన వ్యాఖ్యల విషయంలో కూడా ఈ అనిరుథ్ రెడ్డి కాస్త అతిగానే స్పందించి పవన్ అభిమానుల నోటికి ఆహారమయ్యారు. ఇక ఇప్పుడు తన ఇప్పసారా వివాదంలోకి పవన్ ఖుషి సినిమా గుడుంబాను కలిపారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Will OG Return Before Pawan Kalyan-Surender Reddy Film?

After the disastrous performance of Ustaad Bhagat Singh, Pawan Kalyan fans have been eagerly waiting…

14 minutes ago

Ajay Devgn Avoids Akshay Kumar: Sensible or Scared?

Two upcoming releases, Dhamaal 4 and Welcome to the Jungle, have changed their release dates.…

33 minutes ago