ఈ పంద్రాగస్టు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, రాజకీయ పార్టీలకు అత్యంత కీలకంగా మారిపోయింది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తాము ఎన్నికల హామీలో ఇచ్చిన వాగ్దానాన్ని ఈ పంద్రాగస్టు రోజున నెరవేరుస్తామని ప్రకటించారు.
దీనితో ప్రభుత్వాలు తాము ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకుంటాయా లేదా అని అటు ప్రతిపక్ష పార్టీలు సైతం ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆరు మాసాలు నిండిపోయిన తరుణంలో ఎన్నికల హామీలో ఇచ్చిన రైతు రుణమాఫీ పైన అటు బిఆర్ఎస్ నేత హరీష్ రావు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రాజీనామా శపధాలు చేసుకున్నారు.
ఆగస్టు 15 లోపు ఒక్కో రైతుకు 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామని అందుకోసం అన్ని గైడ్ లైన్స్ ప్రతిపాదనలను సిద్ధం చేయమంటూ ముఖ్యమంత్రి నుండి అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం రుణమాఫీ అమలు చేసి తమను గట్టున పడేస్తుందా? లేదా? అనే ఆందోళనలో లబ్ధిదారులు పంద్రాగస్టు కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
అలాగే హామీ నిలబెట్టుకోలేకపోతే రేవంత్ ఇచ్చిన మాట ప్రకారం రాజీనామా చేస్తాడా? లేదా? అని హరీష్ రావు, ప్రభుత్వం హామీ అమలు చేస్తే హరీష్ రావు రాజీనామా చేస్తారా? అని కాంగ్రెస్ ఎవరికీ వారు ఆగస్టు పదిహైను సెలవు కోసం విద్యార్థులు ఎదురు చూసినట్లుగా చూస్తున్నారు. తెలంగాణ పంద్రాగస్టు ఎదురు చూపులు ఇలా ఉంటే ఇక ఆంధ్రప్రదేశ్ పంద్రాగస్టు రాజకీయం మరోలా ఉంది.
2019 వైసీపీ ప్రభుత్వంలో మూతపడిన అన్న క్యాంటీన్లను ఈ ఆగస్టు 15 నుండి పునరుద్ధరించడానికి కూటమి ప్రభుత్వం భావిస్తుంది. తొలి దశలో 183 క్యాంటీన్లను ఏర్పాటు చెయ్యాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో మూతపడిన అన్న క్యాంటీలను 20 కోట్లతో మరమత్తులు చేయిస్తున్నారు. అలాగే అన్న క్యాంటీన్లకు ఆహరం సరఫరా చేసే సంస్థలకు కూడా టెండర్లు ను ఆహ్వానించింది ప్రభుత్వం.
5 రూపాయలకే భోజనం అంటూ టీడీపీ పార్టీ ఎన్టీఆర్ పేరు మీదగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అన్న క్యాంటీన్లను గత వైసీపీ ప్రభుత్వం మూసివేసింది. పేదవాడికి అందుబాటులో ఆహారం అనే నినాదంతో టీడీపీ ముందుకొస్తే టీడీపీ విధానాలు మేము కొనసాగించము అనే ముర్కత్వంతో వైసీపీ ముందుకెళ్లింది. ఈ పంద్రాగస్టు నాడు వైసీపీ మూర్కత్వనికి సమాధానం చెపుతూ మళ్ళీ అన్న క్యాంటీలను అందుబాటులోకి తేవాలనే గట్టి పట్టుదలతో టీడీపీ అడుగులు వేస్తుంది.
Director Rahul Sankrityan had some big words for Rashmika Mandanna at the Ranabaali pre-release event.…
Water is becoming a major political and economic challenge for southern India. Andhra Pradesh, Telangana,…