
అయితే కాంగ్రెస్ నేతలందరూ ఒక్కతాటిపైకి వస్తే వారిని ఏ శక్తీ అడ్డుకోలేదని కర్ణాటక కాంగ్రెస్ నిరూపించి చూపింది. కానీ ఎన్నికలలో గెలవగానే మళ్ళీ ముఖ్యమంత్రి పదవి కోసం సిద్దరామయ్య, శివకుమార్ రెండువర్గాలుగా చీలిపోయి కోట్లాడుకొంటున్నారు. కాంగ్రెస్‌లో ఇది సర్వసాధారణమైన విషయమే కనుక నేతలందరూ కిందామీదాపడి ఈ సమస్యను ఎలాగో పరిష్కరించుకుంటారు. కనుక దాని గురించి ఇప్పుడు ఆలోచన అనవసరం.
అయితే కర్ణాటక కాంగ్రెస్ సాధించిన ఈ విజయాన్ని తెలంగాణ కాంగ్రెస్ అందిపుచ్చుకొని రాష్ట్రంలో మళ్ళీ రెండో స్థానంలోకి రాగలదా? అనే చర్చ ఇప్పుడు మొదలైంది. ఎందుకంటే, నేటికీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఉన్నంతమంది బలమైన నేతలు, విస్తృతమైన పార్టీ క్యాడర్, బలమైన ఓటు బ్యాంక్ బీజేపికి లేవు.
అయినప్పటికీ తెలంగాణలో బీజేపిలో రెండో స్థానంలోకి ఎలా నిలువగలుగుతోంది? ప్రతీ ఎన్నికలలో బిఆర్ఎస్‌తో ఎలా పోటీ పడగలుగుతోంది? అంటే బలమైన నాయకత్వం… ఆ నాయకత్వంలో అందరూ కలిసికట్టుగా పనిచేస్తుండటమే కారణంగా కనిపిస్తోంది. కానీ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఇది గుర్తించలేక ప్రతీసారి చతికిలపడుతున్నారు.
అయితే కర్ణాటక శాసనసభ ఎన్నికలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఓ దారి చూపించాయి కనుక ఇకనైనా కాంగ్రెస్ నేతలందరూ కలిసికట్టుగా పనిచేయడం అలవరచుకుంటే తెలంగాణ శాసనసభ ఎన్నికలలో విజయం సాధించగలుగుతారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈ జ్ఞానోదయం అవుతుందా లేదా? చూడాలి.
Devi Sri Prasad and Sukumar have shared a memorable musical journey for nearly two decades,…
బిర్యానీ వండటం అందరికీ రాదు. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు అందరూ ఆడలేరు. కానీ వాటిని ఆస్వాదించగలరు. వాటి మంచి చెడ్డలు…