
మీరు తీసిన క్లాసిక్స్ సత్య, కంపెనీ తరహా సినిమాల స్క్రిప్ట్ లు ఇస్తే తన వెబ్ సైట్ లో పెడతానని, అవి సినీ రంగంలోకి రావాలనుకుంటున్నవారికి ఎంతగానో ఉపయోగపడతాయని అడుగగా, ఆమెకు దిమ్మతిరిగే సమాధానాన్ని ఇచ్చాడు. నిజానికి ఆ రెండు సినిమాలకు స్క్రిప్ట్ లేదని, ఆసక్తి ఉన్న వారికి ఆ సినిమాలు చూసి స్క్రిప్ట్ రాసుకోమని చెప్పమని అవాక్కయ్యే జవాబు ఇచ్చారు.
తన తల్లి మీద మరియు స్టీవెన్ స్పీల్ బర్గ్ మీద ఒట్టేసి చెప్తున్నాను… తాను బౌండెడ్ స్క్రిప్ట్ లతో వెళ్ళినపుడే తనకు ఫ్లాపులు ప్రారంభమయ్యాయని బదులిచ్చాడు. వర్మ నుండి వచ్చిన స్పందనకు అవాక్కైన అనుపమ చోప్రా దానిని సోషల్ మీడియాలో ‘వర్మ క్లాసిక్’ అంటూ పోస్ట్ చేయడంతో… అది కాస్త వైరల్ అయ్యింది. వర్మ ఏం చేసినా, అది హాట్ టాపిక్ కాకుండా ఎలా ఉంటుందిలేండి!
ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అనేది రాజకీయంలో సర్వసాధారణం. అధికారం శాశ్వతం అనుకుని హద్దులు దాటి వ్యవహరిస్తే చివరికి చెల్లించే…
Telugu cinema has developed a habit of racing against time, especially when it comes to…