
Anupama Parameswaran opens up about her alleged two-year toxic relationship and comments about her ex-boyfriend.
2015లో ప్రేమమ్ అనే మలయాళ చిత్రంతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్ అంటే కుర్రాళ్లలో ఒక క్రేజ్. 19 ఏళ్ల వయసులో ఉంగరాల జుట్టుతో సన్నగా రివటలా ఉన్న ఆ సూది కళ్ల చిన్నదాన్ని యువత పోటీ పడి మరీ ప్రేమించింది యువతరం. “దొండకాయ బెండకాయ అనుపమ నా గుండెకాయ” అనేది ఫ్యాన్స్ స్లోగన్. దాన్ని అనుపమ కూడా సోషల్ మీడియాలో పలుమార్లు షేర్ చేసేది.
అమాయకంగా, ఆహ్లాదంగా, ఆనందంగా ఉండే అనుపమ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తన టాక్సిక్ రిలేషన్ షిప్ గురించి చేస్తున్న పోస్టులు, పలు మీమ్ పేజీల మీద పోస్టుల కింద చేస్తున్న కామెంట్స్ చూస్తూనే ఉన్నాం. “క్రేజీ కళ్యాణం” టీజర్ లాంచ్ ఈవెంట్లో అయితే ఆ విషయమై ప్రశ్నించిన మీడియాపై విరుచుకుపడింది అనుపమ.
ఇప్పుడు అదే విషయమై ఏకంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో తన రిలేషన్ షిప్ ఎంత టాక్సిక్, తన బాయ్ ఫ్రెండ్ ఎంత టాక్సిక్ అనేది కుదిరినంత కఠినంగా వివరించింది. సదరు మలయాళ ఇంటర్వ్యూ టీమ్ కూడా దాన్ని రెండు భాగాలుగా విభజించి, నిన్న ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేసి.. త్వరలో సెకండ్ పార్ట్ రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం అనుపమ స్టేట్మెంట్స్ తో నిండిపోయింది. మరీ ముఖ్యంగా తన ఎక్స్ ను అపరిచితుడుతో పోల్చుతూ ఆమె చేసిన కామెంట్ వైరల్ అవుతోంది. అనుపమ కానీ, అనుపమను ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్ కానీ ఆ బాయ్ ఫ్రెండ్ పేరు ఇంటర్వ్యూలో ఎక్కడా మెన్షన్ చేయనప్పటికీ.. అది ఎవరు అనేది అందరికీ అర్థమైంది.
అయితే.. ఈ హల్ చల్ విషయంలో అనుపమ చేసిందే కరెక్ట్ అంటూ ఆమెను సపోర్ట్ చేసేవాళ్ళు ఎంత మంది ఉన్నారో, ఒక అబ్బాయిని మరీ ఇంత బ్లేమ్ చేయాల్సిన అవసరం ఉందా? అని తిట్టిపోసేవాళ్ళు అంతే మంది ఉన్నారు.
ఎందుకంటే.. ఒక ఎబ్యూసివ్ రిలేషన్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఎంత ఉందో, బ్లేమ్ గేమ్ ఆడకుండా ఉండాల్సిన అవసరం కూడా అంతే ఉంది. ఇక్కడ అనుపమ తాను చాలామంది ఆడపిల్లలకు ఇన్స్పిరేషన్ ఇస్తున్నాను అని చెబుతూనే.. పదే పదే తన ఎక్స్ లవర్ ని బ్లేమ్ చేస్తుండడం అనేది డిస్కషన్ టాపిక్ గా మారింది.
అనుపమ ప్రస్తుత వయసు 30 ఏళ్లు, 19 ఏళ్లకే ఇండస్ట్రీకి వచ్చిన అమ్మాయి, తనకంటూ స్టార్ డం ఉన్న అమ్మాయి.. ఒక రిలేషన్ షిప్ లో అంతలా తగ్గిపోయి ఉండాల్సిన అవసరం ఏముంది? అది కూడా రెండేళ్లు. సరిగ్గా 10 నెలల క్రితం రిలీజైన బైసన్ ప్రమోషన్స్ లో రిలేషన్ షిప్ విషయంలో అంత హ్యాపీగా, ఓపెన్ గా ఉన్న అనుపమ.. రెండేళ్ల నుండి టాక్సిక్ రిలేషన్ లో ఉన్నాను అని చెప్పడం అనేది విక్టిమ్ కార్డ్ ప్లే చేసినట్లుగానే ఉంది.
ఇక అదర్ సైడ్ ఆఫ్ ది స్టోరీ ఏంటి అనేది బయటికి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అందువల్ల ఇంకొన్నాళ్లు అనుపమ వెర్షన్ మాత్రమే వినిపిస్తుంది, కనిపిస్తుంది. అనుపమ ఇంతటితోనైనా ఆగుతుందా? లేక తన తదుపరి సినిమాల ప్రమోషన్స్ లో ఇదే బ్లేమ్ గేమ్ కంటిన్యూ చేసి మరింత మైలేజ్ పొందుతుందా? అనేది చూడాలి.
India's 351/7 looked like a strong enough total, but the third ODI against West Indies…
Legendary filmmaker Singeetham Srinivasa Rao has passed away at Kauvery Hospital in Chennai following ill…