
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్కలు కలిసి విల్లు ఎక్కుపెట్టిన ఈ పోస్టర్ లో ఒక్క విషయం మాత్రం షాక్ కు గురి చేసే అంశమే. వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ పోస్టర్ లో అనుష్క లుక్ అవాక్కు చేస్తోంది. ‘సైజ్ జీరో’ తర్వాత బాగా లావుగా మారిపోయిన అనుష్క లుక్ ను చూసి జక్కన్న అసహనం వ్యక్తం చేసారన్న వార్తలు గతంలో హల్చల్ చేసిన విషయం తెలిసిందే.
దీంతో ‘బాహుబలి 2’లో అనుష్క ఎలా ఉంటుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. కానీ, ఈ సందేహాలను పటాపంచలు చేస్తూ… తాజా పోస్టర్లో అనుష్క దర్శనమిచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే అనుష్క లుక్ స్టన్నింగ్ గా ఉందని చెప్పాలి. ప్రభాస్ లుక్ ఇదివరకే రివీల్ చేయడంతో, యంగ్ రెబల్ స్టార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు గానీ, ‘దేవసేన’ మాత్రం కేక పుట్టిస్తోంది.
Ram Charan’s upcoming film Peddi, directed by Buchi Babu Sana, is generating strong buzz not…
The Tamil Nadu Legislative Assembly witnessed a high-voltage moment today as the Leader of the…