
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ నేడు 2026-27 ఆర్ధిక సం.కి రాష్ట్ర వార్షిక బడ్జెట్ శాసనసభలో ప్రవేశపెట్టారు.
బడ్జెట్ మొత్తం విలువ: రూ.3,32,205 కోట్లు, దానిలో రెవెన్యూ వ్యయం రూ.2,56,143కోట్లు, మూలధన వ్యయం రూ.53,915 కోట్లు, రెవెన్యూ లోటు రూ.22,002 కోట్లు, ద్రవ్యలోటు రూ. 75,868 కోట్లుగా పేర్కొన్నారు.
ఊహించినట్లే బడ్జెట్ అభివృద్ధి, నిర్మాణ పనులకు భారీగా నిధులు కేటాయించారు. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు అంటూ ప్రజలను మభ్యపెడితే కూటమి ప్రభుత్వం బడ్జెట్‌లో విశాఖ (ఆర్ధిక ప్రాంతం అభివృద్ధి) రూ.28,000 కోట్లు, రాయలసీమ (గ్లోబల్ హార్టికల్చర్ క్లబ్) రూ.30,000 కోట్లు కేటాయించి వాటి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. రోడ్లు, కొత్త విమానాశ్రయాలకు రూ.13,546 కోట్లు కేటాయించారు.
ఆర్ధిక పరిమితుల కారణంగా బడ్జెట్‌లో అమరావతికి: రూ.6,000 కోట్లు, పోలవరం రూ. 6,105 కోట్లు కేటాయించారు. కానీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పంచాయితీ రాజ్ శాఖకు రూ.22,942 కోట్లు కేటాయించారు.
పాఠశాల విద్యాశాఖ రూ.32,308 కోట్లు, జలవనరుల శాఖ రూ.18,224 కోట్లు, మున్సిపల్ శాఖ రూ.14,539 కోట్లు, విద్యుత్ శాఖ రూ.13,934 కోట్లు, వ్యవసాయం, అనుబంద రంగాలకు రూ.13,598 కోట్లు, హోంశాఖ రూ.9,165 కోట్లు, హాస్టల్స్, గురుకులాలకు : రూ.300కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు.
సంక్షేమ పధకాలు: అన్నదాత సుఖీభవ: రూ.6,600 కోట్లు, మధ్యాహ్న భోజన పధకం: రూ.2,161కోట్లు, విద్యార్ధుల ఉపకార వేతనాలు: రూ.3,836 కోట్లు, ఎన్టీఆర్ భరోసా: రూ.27,719 కోట్లు, ఎన్టీఆర్ వైద్య సేవ : రూ.4,000 కోట్లు, కేటాయించారు.
ఇతర కార్యక్రమాలు: వీబీజీ రామ్‌జీ: రూ.8,365 కోట్లు, జల్ జీవన్ మిషన్: రూ.4,000 కోట్లు, స్వచ్చా భారత్ మిషన్: రూ.1,037 కోట్లు, సర్దుబాటు నిధి: రూ.1,500 కోట్లు కేటాయించారు.
సైబర్ క్రైమ్ నేరాల సంఖ్య క్రమంగా పెరుగుతున్నందున రాష్ట్రంలో ప్రతీ జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.
NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…
Team India started the T20I series against West Indies with a complete performance in Lucknow.…