
ఐదేళ్ల తన అధికారంతో ఏపీకి అమరావతితో బాబు ఒక మార్గం వేస్తె దానికి జగన్ వైసీపీ తో ఒక గండి కొట్టారు. ఆ తరువాత 2024 అటు జనసేనను, ఇటు బీజేపీ ని కలుపుకుని అధికారంలోకి వచ్చిన టీడీపీ కి ఇప్పుడు వైసీపీ పాలనతో నష్ట పోయిన రాష్ట్రంతో పాటుగా సొంత పార్టీ నేతల నుంచే ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి.
మూడు పార్టీలు కూటమి కట్టడంతో టీడీపీ పార్టీలో కొందరు ముఖ్య నేతలు సైతం త్యాగాలకు సిద్దపడవలసి వచ్చింది. తమకు బలమున్నా, గెలుపు మీద ధీమా ఉన్నా కూడా కొన్ని కొన్ని ప్రాంతాలలో టీడీపీ నేతలు మిత్ర పక్షాల కోసం తమ సీటును త్యాగం చేయవల్సిన పరిస్థితి.
అయితే అటు జనసేన కూడా టీడీపీ , బీజేపీ కోసం 21 సీట్లకు తన బలాన్ని కుదించుకుని తన వంతు పొత్తు ధర్మానికి కట్టుబడి త్యాగాన్ని చేసింది. అయితే టీడీపీ మాదిరి అన్ని నియోజకవర్గాలలో క్షేత్ర స్థాయిలో జనసేనకు పటిష్ట నాయకత్వం లేదు. ఇది ఆపార్టీ అధినేత పవన్ కూడా ఒప్పుకున్న వాస్తవమే.
అయితే ఇప్పుడు టీడీపీ అధినేత బాబు ముందు ఈ త్యాగాలకు న్యాయం చేయవల్సిన బాధ్యత తో పాటు పొత్తు ధర్మానికి కట్టుబడాల్సిన విధి కూడా నెత్తి మీద ఉంది. పార్టీలో ఆశావాహుల శాతం రోజురోజుకి పెరిగిపోతుంది. ఇప్పటికే పిఠాపురం నుంచి వర్మకు, వంగవీటి రాధకు మీ త్యాగాలకు తగిన న్యాయం చేసే బాధ్యత నాదే అంటూ ఎన్నికల ప్రచారంలో బాబు వీరిద్దరికి బహిరంగ హామీ ఇచ్చారు. ఇదంతా కూడా చంద్రబాబు కి పులి మీద స్వారీ మాదిరి తయారయ్యింది.
ప్రత్యక్ష ఎన్నికలకు దూరమైన పార్టీ సీనియర్లు ఒక పక్క, పోత్తు కోసం సీటు వదులుకున్న నేతలు మరోపక్క, పొత్తు ధర్మమంటూ జనసేన, బీజేపీ ఇంకో పక్క ఇలా బాబు చుట్టూ ఎటు చుసిన సొంత పార్టీ నేతల నుంచి మిత్ర పక్షాల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతుంది. దీనికి తోడు ఈ మూడు పార్టీల మధ్య విద్వేషాలు ఎప్పుడు వస్తాయా అని గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్న వైసీపీ మరో వైపు.
దీనితో బాబు కి అధికారం ఎప్పుడు అలంకారం కాదు ఒక పెద్ద బుదిబండే అనేది స్పష్టమయింది. రాష్ట్ర ఖాజాను ఖాళీ చేసి కూటమి ప్రభుత్వానికి అప్పులతో, తాకట్లతో మొండి చెయ్యి చూపించింది వైసీపీ. దానికి తోడు నిత్యం కూటమి ప్రభుత్వం మీద అసత్య వార్తలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం వైసీపీ దిన చర్యలో భాగమయిపోయింది.
ఇటు పక్క సూపర్ సిక్స్ అంటూ టీడీపీ ఇచ్చిన మేనిఫెస్టో అమలుకు దారులు వెతుక్కోవాలి, అటు పక్క రాజధాని అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేసి ఇక ఏపీ రాజధాని అమరావతే అనేలా చెక్కుచెదరని సంతకం చెయ్యాలి. దీనికి తోడు పార్టీ నేతలను, మిత్ర పక్షాలను సంతృప్తి పరచాలి.
జగన్ మాదిరి వందల మంది సలహాదారులను సృష్టించి, అనేక చైర్మన్ పదవులను తెర మీదకు తెచ్చి బాబు కూడా పారీ నేతలకు పదవుల పంజారం చేయవచ్చు. దానితో పార్టీ నేతలను తృప్తి పరచవచ్చు కానీ ఇలా చేస్తే రాష్ట్ర ప్రజల కష్టాన్ని వృధా చేసినట్లే అవుతుంది.
ఇటు ప్రజలు కట్టే టాక్స్ లకు అన్యాయం జరగకుండా, త్యాగాలకు న్యాయం కావాలి… పొత్తుకు న్యాయం చెయ్యాలి, అంటే కర్ర విరగకూడదు పాము సైలెంట్ అవ్వాలి అనే తీరుగా బాబు తన మార్క్ చూపించాలి.
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…
Tamil actress Divya Bharathi, known for Bachelor and her special appearance in Maharaja, has sparked…