
జగన్ తీసుకొన్న ఈ నిర్ణయం వలన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం చాలా ఇబ్బంది పడుతున్నప్పటికీ టిడిపికి మేలు కలిగే కొన్ని రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి.
ముందుగా టిడిపితో కలిసి ఎన్నికలలో పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించేశారు. టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీ వెళ్ళి జాతీయ మీడియాకు వైసీపి పాలనలో ఏపీలో జరుగుతున్న అరాచకాలు, అవినీతి, ఇటువంటి రాజకీయకక్ష సాధింపుల గురించి వివరిస్తున్నారు. తద్వారా తొలిసారిగా నారా లోకేష్ పేరు జాతీయ మీడియాలో మారుమ్రోగుతోంది.
చంద్రబాబు నాయుడు అరెస్టుతోనే జగన్ బీజేపీ అధిష్టానానికి కూడా పరీక్ష పెట్టారని చెప్పవచ్చు. కానీ బీజేపీ అధిష్టానం ఇంతవరకు చంద్రబాబు నాయుడు అరెస్టుపై స్పందించకపోవడంతో టిడిపి నేతలు ఆగ్రహంగా ఉన్నారు. ఇదే సమయంలో ఇండియా కూటమిలో నేతలు చంద్రబాబు నాయుడుకి సంఘీభావం తెలుపుతున్నారు. నారా లోకేష్ కు ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు.
కనుక టిడిపి ఇండియా కూటమి వైపు అడుగులు వేస్తోందంటూ విజయసాయి రెడ్డి వరుసపెట్టి ట్వీట్స్ చేస్తున్నారు. అంటే బీజేపీ అధిష్టానాన్ని కూడా ఆటో ఇటో అంటే టిడిపి, జనసేనలవైపు ఉంటుందా లేక లోపాయికారిగా వైసీపికి సహకరిస్తుందా తేల్చుకోమని ఒత్తిడి చేస్తున్నట్లే భావించవచ్చు.
ఇంతకాలం బీజేపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోకుండా టిడిపి, జనసేన, వైసీపిలను తన చుట్టూ తిప్పించుకొంటూ కాలక్షేపం చేస్తోంది. కానీ జగన్ తీసుకొన్న ఈ దుందుడుకు నిర్ణయం వలన ఇప్పుడు బీజేపీ కూడా ఏ గట్టున ఉండాలో తేల్చుకోక తప్పడం లేదు.
ఇదీ ఒకందుకు మంచిదే. ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం ఉన్నందున ఒకవేళ బీజేపీ అధిష్టానం పొత్తుల విషయంలో స్పష్టత ఇచ్చేస్తే, టిడిపి, జనసేనలకే మంచిది. అప్పుడు విజయసాయి రెడ్డి కోరుకొంటున్నట్లు అవసరమైతే ఇండియా కూటమిలో చేరి, ఏపీలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీల మద్దతు పొందవచ్చు.
Rohith is one of the potential Bigg Boss Telugu contestants who could win the title.…
Right from the first show of Rajinikanth's anticipated sequel Jailer 2, social media has been…