
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆస్తులకే భద్రత లేదు అని భావించిన వారికి ఇప్పుడు మరో షాక్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసింది వైసీపీ. ఇకనుంచి ప్రజల వ్యక్తిగత ఆస్తుల పై కూడా వారి హక్కుని ప్రభుత్వం లాక్కునేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాలను సిద్ధం చేసి అమలుకు వైసీపీ సన్నాహాలు చేపట్టిందంటూ టీడీపీ, జనసేన లు చేస్తున్న ప్రచారంలో నిజమెంత అంటే..?
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని ప్రభుత్వ రంగ భవనాలకు, అన్ని కార్యాలయాలకు వైసీపీ జెండా రంగులు వేయడానికి కొన్ని వందల కోట్లు వెచ్చించించిన వైనం కళ్ళ ముందు సాక్ష్యాత్కారం అవుతూనే ఉంది. అలాగే విద్యార్థుల పాఠ్య పుస్తకాల మీద కూడా గతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ అధికారిక ముద్రను తొలగించి ఆ స్థానంలో జగన్ ఫోటోను ముద్రించిన సంఘటనల మీద కూడా ఇప్పటికే పవన్ విమర్శల అస్త్రాన్ని ఎక్కుపెట్టారు.
పదేళ్ల నుండి బెయిలు మీద ఉన్న వ్యక్తి ఫోటోను పాఠ్యపుస్తకాలలో ముద్రించి విద్యార్థులకు ఎం మెసెజ్ ఇస్తున్నారు అంటూ వైసీపీ నేతల పై ప్రశ్నల దాడి కొనసాగించారు పవన్. అలాగే ప్రజలవ్యక్తిగత ఆస్తుల పత్రాల మీద, తాత ముత్తాతల నుంచి సంక్రమించిన భూమి పత్రాల మీద, రైతుల పాస్ పుస్తకాల మీద గతంలో ఏ ముఖ్యమంత్రి ఫోటో ముద్రించి ఉండేది కాదు.
అది ప్రజల వ్యక్తిగత ఆస్తి కావున దానికి సంబంధించిన వారి ఫోటోలను మాత్రమే ఆ పత్రాల మీద చూపించేవారు. కానీ వైసీపీ ప్రచార పిచ్చి హద్దులు దాటిందని చెప్పాలో కానీ ప్రజల వ్యక్తిగత ఆస్తులు పై తాను హక్కు పొందే క్రమంలో భాగంగా జగన్ ఈ చర్యలా అని వారి ఆస్తి పత్రాల పై తన ఫోటోను ముద్రించారు. ఇలా వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అన్ని సంఘటనలు ప్రతిపక్షాలు విమర్శలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
అలాగే జగన్ మాట మీద కానీ వైసీపీ ఇచ్చిన హామీల మీద కానీ ఇప్పటికే నమ్మకాన్ని కోల్పోయిన ప్రజానీకం కూటమి పార్టీలు చేస్తున్న విమర్శలను నమ్మే పరిస్థితికి చేరుకున్నారు. ఇందులో భాగమే పులివెందులలో భారతికి ఎదురైన చేదు అనుభవం. పులివెందుల ప్రచారానికి వెళ్లిన భారతికి జగన్ సొంత ఇలాకాలోనే ఎదురు దెబ్బ తగిలింది. మా ఆస్తి పత్రాల మీద మీ భర్త ఫోటో పెట్టాల్సిన అవసరమేముంది అంటూ భారతిని నిలదీశారు సదరు వ్యక్తి.
అయితే ఆయన ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే భారతి అక్కడి నుంచి జారుకున్నారు. ప్రత్యేక హోదా, రాజధాని విషయంలో జగన్ 2019 ఎన్నికల ముందు ఒక మాట చెప్పారు ఎన్నికల తరువాత మరో మాట మార్చారు. ఇప్పుడు కూడా జగన్, వైసీపీ ది ఇదే వ్యూహం అయ్యిఉండవచ్చు అనే వారి అభిప్రాయమే ఎక్కువమందిలో నాటుకు పోవడంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రజలలో అభద్రతా భావం ఏర్పడింది.
అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై కూటమి నేతలు ఎన్ని విమర్శలు చేసినా వైసీపీ నేతలు మాత్రం మోనం వహించడం కూటమి నేతలు చేస్తున్న విమర్శల్లో ఉన్న నిజాయితీకి, బలాన్ని తెలియచేస్తుంది.
Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…
After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…