కురుక్షేత్రం కాదు రామాయణమట..!

జగన్ తనను తానూ ఒక అర్జునుడిగా పోల్చుకుంటూ తన వైసీపీ సైన్యాన్ని పాండవ సైన్యంగా తమ ప్రత్యర్థులైన టీడీపీ, జనసేనలను కౌరవులుగా అభివర్ణిస్తూ జరగబోయేది కురుక్షేత్రం మీరు కృష్ణుడిలా మారి మీ బిడ్డ అర్జునుడి వైపే ఉండాలి అంటూ ఎన్నికల ప్రచారంలో ఇతిహాసాలను కూడా జోడిస్తున్నారు.

అలాగే ఎన్నికల ప్రక్రియను కురుక్షేత్ర సమరంతో పోలుస్తూ పురాణాలకు కూడా తమ రాజకీయ సౌలభ్యానికి వాడుకుంటున్న జగన్ కు, జగన్ ను ఎదుర్కోవడానికి టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, ఎల్లో మీడియా అన్ని కలిసి గుంపుగా కలిసి వస్తున్నాయి, సింహం సింగల్ అంటూ ప్రచారం చేసుకుంటున్న వైకాపా నేతలకు సోషల్ మీడియా వేదిక గా గట్టి కౌంటర్లు పడుతున్నాయి.

ADVERTISEMENT

జరగబోయేది కురుక్షేత్ర యుద్ధం కాదు రావణ సంహారం. సీతా దేవిని అపహరించిన పది తలల రావణుడిని అంతమొందించడానికి దేవుడైన శ్రీ రాముడికి సైతం హనుమంతుడితో పాటు ఆయన వానర సైన్యం కూడా సాయం అందించింది. అలాగే తనకు ఎటువంటి శక్తి లేకపోయినా ఉడుత కూడా తనవంతుగా కొన్ని ఇసుక రేణువులు తెచ్చి రామసేతు నిర్మాణంలో భాగమయ్యింది.

అలాగే ఇప్పుడు ”అధికారం, డబ్బు, పదవి, వ్యవస్థలు, ప్రైవేట్ సైన్యం, 151 మంది ఎమ్మెల్యేలు, 21 మంది ఎంపీ లు, మీడియా, అధికారులు, దాడులు” అనే పది తలలతో ఉన్న జగన్ ప్రభుత్వాన్ని అంతమొందించడానికి ఇటు పక్క టీడీపీ, జనసేన, బీజేపీ లు కలిసి ముందుకెళ్తున్నాయి. అయితే ఇందులో రాముడు, హనుమంతుడు, వానర సైన్యం, ఉడుత పాత్రలు ఎవరు పోషించినప్పటికీ అంతిమ లక్ష్యం వైసీపీని గద్దె దింపాడమే.

కాబట్టి కొన్ని కొన్ని సార్లు ఒంటరిగా వెళ్లడం కంటే కలిసి వెళితేనే విజయం వరిస్తుందని అదే పురాణాలు రుజువు చేసాయి కాబట్టి అర్ద బలం అంగ బలం చూసుకుని నేను మహాదేవుని భక్తుడిని మహా బలశాలిని అంటూ తనను తానూ ఎక్కువగా ఊహించుకుని యుద్ధరంగంలో అడుగుపెట్టిన రావణుడికి మొదటి దెబ్బ తన ఇంటి నుంచే మొదలయ్యింది. అయితే ఆ ప్రమాదాన్ని తన భుజబలంతో అధిగమించేస్తా అంటూ ముందగు వేసిన రావణుడి అంతం ఆ విభూషణుడితోనే సాధ్యమయ్యింది.

‘ఇంటి గుట్టు లంకకు చేటు’ అనే సామెత కూడా ఈ రామాయణ చరిత్ర ఆధారంగానే వచ్చిందనేది వైసీపీ మరిచినట్టుంది. ఇప్పుడు విభూషణుడి పాత్రలో ఉంది వైస్ షర్మిల. అలాగే తనకున్న అధికారంతో షర్మిలను అడ్డుకోగలను అంటూ లైట్ తీసుకున్న జగన్ కు ఎన్నికలు దగ్గర పడే కొద్దీ షర్మిల ఏ పులివెందుల గుట్టు బయటపెట్టి జగన్ ప్రభుత్వానికి చేటు చేస్తుందో చూసుకోవాలి అంటూ వైసీపీ నేతలకు కురుక్షేత్రమే కాదు రామాయణ చరిత్ర కూడా ఒక్కసారి తెలుసుకోండి అంటూ సమ్సజిక మాధ్యమాలలో కౌంటర్లు పడుతున్నాయి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Indian 3: Shankar’s Salary Sacrifice Story Sparks Doubts

Ever since the official announcement of Indian 3 dropped, social media has been flooded with…

18 minutes ago

Akshay Kumar’s Sequels: Director’s Stance Backfires

Priyadarshan had a record of directing remakes for the majority of his career. He even…

38 minutes ago