Telugu

డీఎస్సీపై హైకోర్టులో మొట్టికాయలు.. సరిపోతాయో లేదో?

మనం అబద్దాన్ని నిజమని నమ్మి ఆ భ్రమలో ఉంటే ఉండొచ్చు. కానీ కొంతమంది ఇతరులను కూడా నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు. మన రాజకీయాలలో ఇది పరిపాటిగా మారిపోయింది.

ఏపీ డీఎస్సీలో అవకతవకలు జరిగాయని, సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని వైసీపీ ఆందోళనలు చేస్తోంది.

ADVERTISEMENT

కానీ వాటిని ప్రజలు, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆ పార్టీ తరపున ఎమ్మెల్సీ పర్వత రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ వేసి సీబీఐ జరిపించాలని కోరారు.

అయితే రాజకీయ ప్రయోజనాల కోసం వేసే ఇలాంటి పిటిషన్లను అనుమతిస్తే ‘ప్రజాహిత పిటిషన్’ ఉద్దేశ్యం దెబ్బ తింటుందని చురకలు వవేసింది, ఆ పిటిషన్‌ని కొట్టివేసింది.

ఇటీవల నీట్ అంశంపై ఢిల్లీలో సీజేపీ ఆందోళనల కారణంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రాధాన్ రాజీనామా చేయడంతో దేశంలో వైసీపీ వంటి ప్రతిపక్షాలకు చాలా స్పూర్తి కలిగించింది. తాము కూడా ఆందోళనలు చేస్తూ మంత్రుల చేత రాజీనామాలు చేయిస్తే ప్రభుత్వం పడిపోయి, మళ్ళీ ఎన్నికలు వస్తాయని పగటి కలలు కంటున్నాయి.

వైసీపీ కూడా వాటిలో ఒకటి. ఆందోళనలతో ఆశించిన ఫలితం రాకపోవడంతో సీబీఐ విచారణ అంటూ హైకోర్టుకి వెళ్తే అక్కడా మొట్టి కాయలు తప్పలేదు.

అయితే డీఎస్సీ నోటిఫికేషన్‌ మొదలు నియామక పత్రాలు అందించే వరకు ప్రతీ దశని చాలా పారదర్శకంగా నిర్వహించామని, అన్నీ రికార్డ్ చేసి ఆన్‌లైన్‌లో ఉంచామని తెలిపింది.

వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ళలో చేయలేకపోయిన డీఎస్సీని తమ ప్రభుత్వం ఇంత తక్కువ సమయంలో సమర్ధంగా నిర్వహించి సుమారు 16,00 ఉద్యోగాలు భర్తీ చేశామని కూటమి ప్రభుత్వం పదేపదే చెప్తోంది. కనుక వైసీపీ హైకోర్టుకి వెళితే అక్కడ మొట్టికాయలు పడ్డ్డాయి. కనుక ఇక్కడితో ఈ రాజకీయ డ్రామా ఆపుతుందా? లేదా సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడా వేయించుకుంటే గానీ తృప్తి కలగదా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Rakul Breaks Silence And Sets The Record Straight

Rakul Preet Singh has broken her silence over reports linking her to an Income Tax…

1 minute ago

IND vs WI T20Is: Where to Watch, Pitch Report & Playing XI?

India and West Indies will begin their five match T20I series on Tuesday, October 6,…

31 minutes ago