
అందరికీ వినోదం పంచే సినీ పరిశ్రమను కన్నీళ్ళు పెట్టుకొనేలా చేస్తుంది. సినిమా థియేటర్ల యజమానులను ముప్పతిప్పలు పెడుతుంటుంది. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా కార్యాలయాల చుట్టూ తిప్పించుకొంటుంది. సంక్షేమ పధకాలు ఇస్తున్నట్లే ఇస్తూ మళ్ళీ దానిలో నుంచి కొంత డబ్బు కోసుకొంటుంది.
ప్రభుత్వోద్యోగుల జీపీఎఫ్ ఖాతాలో నుంచి వారికి తెలియకుండా డబ్బు విత్ డ్రా అయిపోతుంటుంది. ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ.800 కోట్లు విత్ డ్రా అయితే అంత సొమ్ము ఎవరు తీశారో… ఎక్కడికి పోయిందో తెలియదని అధికారులు చెపుతారు.
మారుమూల గ్రామస్థాయి నుంచి అమరావతి వరకు అందరూ అయిపోయారు… ఇప్పుడు సచివాలయం ఉద్యోగుల వంతు వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ నుంచి అమరావతికి రాజధానిని మార్చినప్పుడు కొంతకాలం సచివాలయం ఉద్యోగులు హైదరాబాద్ నుంచి రోజూ వచ్చిపోయేవారు. కానీ దాంతో పనులు ఆలస్యం అవుతున్నాయి ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రహించిన మాజీ సిఎం చంద్రబాబు నాయుడు వారందరికీ విజయవాడ, అమరావతి పరిసర ప్రాంతాలలో ఉచిత వసతి కల్పించారు.
ఇప్పుడు జగనన్న ప్రభుత్వం వారికి ఆ సౌకర్యాన్ని రద్దు చేసి వారిని తక్షణం ఆ ఇళ్ళను ఖాళీ చేయాలని హుకుం జారీ చేసింది. దీంతో సచివాలయ ఉద్యోగులు తుళ్ళిపడ్డారు. జూన్ 30 అంటే రేపటితో ఆ గడువు ముగుస్తుంది. ఇన్ని వేలమందిని ఇప్పటికిప్పుడు ఇళ్ళు ఖాళీ చేసి పొమ్మంటే ఎక్కడికి పోతాము? ఎక్కడ ఇళ్ళు దొరుకుతాయని ప్రశ్నిస్తున్నారు.
మరోపక్క సచివాలయం, హెచ్ఒడీ ఉద్యోగులకు వారానికి 5 రోజుల పనిదినాల విదానం గడువు జూన్ 27తో పూర్తయింది. దానిని పొడిగిస్తున్నట్లు కానీ నిలిపివేస్తున్నట్లు కానీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో ఈ శనివారం విధులకు హాజరుకావాలా లేదా? అనే సందిగ్ధంలో ఉన్నారు. ఇదీ…జగనన్న రాజ్యం! ఇంకెవరైనా మిగిలిపోయారా?
Chatrapathi is set to re-release in a 4K version this year on the occasion of…
Following the terrible failure of Retro, director Karthik Subbaraj made a comeback with his indie…